అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఆనంద్ దేవరకొండ “గం… గం… గణేశా”

ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా “గం… గం… గణేశా”. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండతో ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. వెన్నెల కిషోర్, ఇమ్మానుయేల్, సత్యం రాజేష్, ప్రిన్స్ టవర్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. మే 31న విడుదల అయినా ఈ సినిమాను హైలైఫ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ నిర్మించడం జరిగింది. కాగా ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. వెండి తెర పై ఈ సినిమాను మిస్ అయినా వారు ఇప్పుడు తమ అమజాన్ ద్వారా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయొచ్చు.