
సుమంత్ కుమార్ హీరోగా సన్నీ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‘అనగనగా’. కాజల్ చౌదరి కథానాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్లో రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్ ని నిర్వహించారు.
సక్సెస్ సెలబ్రేషన్ లో హీరో సుమంత్ కుమార్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాకి ఇంత సపోర్ట్ ఇచ్చిన మీడియా మిత్రులకు థాంక్యూ. ఈ వేడుకకి విచ్చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి రైటింగ్ చాలా ఇంపార్టెంట్. మళ్లీరావా తర్వాత మళ్లీ అద్భుతంగా మంచి అనుభూతిని అందించిన కథ ఈ ‘అనగనగా’. దర్శకుడు సన్నీ, రచయిత దీప్తి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈ సినిమాని శేష్ కి చూపించాను. అప్పుడు తను చాలా ఎమోషనల్ గా సినిమాలో విషయం ఉందని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రేక్షకులు అందరూ కూడా బలపరిచినందుకు ధన్యవాదాలు. మేము అనుకున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. అడియున్స్ అందరికీ నా కృతజ్ఞతలు. బేసిగ్గా సినిమాలు థియేటర్స్‌లోకి వచ్చిన తర్వాత ఓటీటీలోకి వస్తాయి. అయితే ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పుడు సినిమాని కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఆడియన్స్ అందరు కూడా బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్నాను. సినిమాకి ఇంత మంచి ఆదరణ ఇచ్చిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’అన్నారు
హీరో అడివి శేషు మాట్లాడుతూ..అందరికి నమస్కారం. ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక ఫ్యామిలీ వేడుకలా అనిపిస్తుంది. నా ఫస్ట్ సినిమాకి సుమంత్ గెస్ట్ గా వచ్చారు. ఆయన అప్పటినుంచి నాకు ఫ్యామిలీనే. ఈ చిత్రంలో వ్యాస్ పాత్రను సుమంత్ అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకూ అలా ఉండటమే. సన్నీ ఈ కథను అద్భుతంగా తెరకెక్కించారు. నాకు ఈ సినిమా చూస్తున్నంత సేపూ దీన్ని థియేటర్లో కదా చూడాల్సింది అనిపించింది. ఈ చిత్రంలో రామ్ పాత్ర నాతో కూడా కంటతడి పెట్టించింది. ఈ సినిమా నన్నెంత ఏడిపించిందో.. అంతే నవ్వించింది.. ప్రేమలో పడేసింది. విద్యా వ్యవస్థ మారాలని కోరుకునేలా చేయించింది. ఇది సినిమా కాదు ఒక జీవితం. ఈ సినిమా చూసినప్పటి నుంచి అద్భుతమైన సక్సెస్ అవుతుందని నమ్మాను. ఈ సినిమాని మీ ఇంటిళ్లపాది చూడండి. కుదిరితే బిగ్ స్క్రీన్ లో చూడండి. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా కంగ్రాచ్యులేషన్స్’అన్నారు
ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ.. అనగనగా ఒక సినిమా కాదు ఇది ఒక జీవితం. అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. ఒక ఎడ్యుకేషన్ సిస్టం సంబంధించిన సినిమా ఇది. చాలా ఆలోచన రేకెత్తించేలా ఉంది. ఈ సినిమా చూసిన తర్వాత మా పాప స్కూలు మార్పించేద్దామనుకున్నాను. అంతలా టచ్ చేసింది సినిమా. సన్నీ ప్రతి క్యారెక్టర్ ని అద్భుతంగా మలిచాడు. సుమంత్ గారు వ్యాస్ పాత్రలో ఒదిగిపోయారు. ఆయన తాత గారిని చాలాసార్లు గుర్తుతెచ్చారు. ఈటీవీ విన్ అద్భుతమైన కంటెంట్ తో వస్తుంది. తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది’అన్నారు
నిర్మాత రాహుల్ యాదవ్ నక్క మాట్లాడుతూ… ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు టీమ్ అందరికీ థాంక్యూ. సుమంత్ నా ఫస్ట్ హీరో. అప్పుడు కూడా ద బిగ్గెస్ట్ కాన్ఫిడెన్స్ అడివి విశేష గారు ఇచ్చారు. అందరికీ కంగ్రాట్యులేషన్స్. ఈటీవీ విన్ వారితో కొలాబరేట్ అవ్వాలని ఉంది’అన్నారు.
దర్శకుడు సన్నీ సంజయ్ మాట్లాడుతూ.. ఈ కథ మా అందరికీ అమ్మలా రోజూ జోల పాడింది. నాన్నలా ధైర్యాన్నిచ్చింది. గురువులా జ్ఞానాన్ని ఇచ్చింది. ఇదే సినిమా అనే ప్రపంచానికి నన్ను మా టీమ్‌ను పరిచయం చేసింది. ఈటీవీ విన్ వారికి థాంక్ యూ. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన సుమంత్ గారికి థాంక్ యూ. వ్యాస్ పాత్రలో ఆయన్ని తప్పా మరొకని వూహించలేను. ఇదంతా టీం వర్క్. సినిమాని ఇంత సూపర్ హిట్ చేసిన ఆడియన్స్ కి థాంక్ యూ’అన్నారు.
ప్రొడ్యూసర్ రాకేష్ రెడ్డి గడ్డం మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన శేష్ గారికి థాంక్యూ. ఈ ఇంత పెద్ద సక్సెస్ సుమంత్ గారి వల్లే సాధ్యమైంది. ఈ స్క్రిప్ట్ ని నమ్మినందుకు ఆయనకి థాంక్యూ. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి మాట్లాడుతూ.. ఓటీటీలో కేవలం బూతు చిత్రాలే ఆడతాయనే ఒక అబద్దాన్ని మరోసారి పటాపంచలు చేసిన తెలుగు ప్రేక్షకులకు నా పాదాభివందనాలు. ఈ సినిమా చూసి చాలా మంది కంటతడి పెట్టుకున్నామని చెబుతుంటే ఆనందంగా అనిపించింది. సన్నీ అద్భుతంగా తీశాడు. సినిమాకి ఇంత గొప్ప సపోర్ట్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్ యూ. మా కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఇది. జై తెలుగు సినిమా’అన్నారు. ఈ వేడుకలో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.