ఆత్మీయ అతిధుల మధ్య ఘనంగా ప్రారంభమైన “అమ్మా నాన్న మధ్యలో మధురవాణి”

నూతన తారలు గౌతమ్ రాజ్ , సాయి విక్రాంత్ హీరోలుగా , మధుప్రియ, లావణ్య శర్మ, సిరి మరియు అంబిక హీరోయిన్స్ గా పానుగంటి మహంకాలమ్మ, యాదయ్య గౌడ్ సమర్పణలో మానస క్రియేషన్స్ పతాకంపై టి.డి.ప్రసాద్ వర్మ దర్శకత్వంలో బృందాకర్ గౌడ్ నిర్మిస్తోన్న చిత్రం “అమ్మ నాన్న మధ్యలో మధురవాణి”. ఈ చిత్రం మార్చి 28న హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఆత్మీయ అతిథుల మధ్య ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం హీరో, హీరోయిన్స్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి బెక్కం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా ఫణి కుమార్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.. గౌరవ దర్శకత్వం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు గారు చేశారు.. ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో గౌతం రాజ్ ,మధుప్రియ ,సాయి విక్రాంత్ ,సిరివెన్నెల మెయిన్ లీడ్ పాత్రల్లో నటిస్తుండగా.. నరేష్ వీకే, పవిత్ర లోకేష్, నందమూరి తారకరత్న, కెప్టెన్ చౌదరి, బేబీ శరణ్య, మాస్టర్ రాకేష్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ మొదటివారం నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.. అనంతరం ఏర్పాటైన సమావేశంలో నరేష్ వీకే, నటి పవిత్ర లోకేష్, హీరోలు గౌతమ్ రాజ్, సాయి విక్రాంత్, హీరోయిన్స్ అంబిక, మధుప్రియ, లావణ్య శర్మ, దర్శకుడు టిడి ప్రసాద్ వర్మ, సినిమాటోగ్రాఫర్ వాసు, సంగీత దర్శకుడు కార్తీక్ బి. కడకండ్ల, గేయ రచయిత మిట్ట పల్లి సురేందర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, చిత్ర నిర్మాత బృందాకర్ గౌడ్ పాల్గొన్నారు…

నటుడు నరేష్ వీకే మాట్లాడుతూ.. దర్శకుడు ప్రసాద్ వర్మ నాకు బాగా కావాల్సిన వ్యక్తి.. మా కుటుంబ సభ్యుడు.. అతను ఫస్ట్ రాధ కృష్ణ మూవీ చేసాడు అది గత సంవత్సరం రిలీజ్ అయి మంచి హిట్ అయింది.. “అమ్మా నాన్న మధ్యలో మధుర వాణి” టైటిల్ తో నాకు కథ చెప్పాడు ప్రసాద్ వర్మ గారు. చాలా అద్భుతంగా ఉంది. ముందు నాకు టైటిల్ చాలా బాగా నచ్చింది.. దానికి ఎట్రాక్ట్ అయ్యాను.. అందరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.. ఇందులో నేను, పవిత్ర లోకేష్,తారక రత్న ముఖ్య పాత్రల్లో లో నటిస్తున్నాం. మంచి స్టార్ కాస్ట్ అంతా యాక్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ న్యూ జోనర్ లో వస్తున్న గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. రిఫ్రెషింగ్ గా ఉంటుంది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ బాగా హిట్ అవుతున్నాయి. ఈ చిత్రం కూడా తప్పకుండా అందరికీ నచ్చుతుంది.. బృందాకర్ గౌడ్ ప్రసాద్ వర్మను నమ్మి ఈ చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమాతో ఆయన మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను.. అన్నారు.

చిత్ర దర్శకుడు టిడి ప్రసాద్ వర్మ మాట్లాడుతూ.. ఫస్ట్ నేను రాధాకృష్ణ అనే మూవీ చేశాను. ఇది నా సెకండ్ ఫిల్మ్. నరేష్ గారి ఫ్యామిలీతో ఆరేళ్ళు అనుబంధం ఉంది. ఆ పరిచయంతో ఆయనకి ఈ కథ చెప్పాను. నరేష్ గారు చాలా బాగుంది నేను చేస్తాను అని నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. ఇదొక ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. టు జెనరేషన్స్ కి కనెక్ట్ అయ్యే కథ ఇది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి రెండు షెడ్యూల్స్ లో ఫినిష్ చేస్తాం. నిర్మాత బృందాకర్ గౌడ్ గారు కథ నచ్చి ఎంతో ఇన్స్పైర్ అయి ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్స్ అన్నారు.

పుట్ట మధు మాట్లాడుతూ.. మా పెద్దపల్లి వాసి ప్రసాద్ వర్మ మంథని మట్టి గడ్డ తెలంగాణ ముద్దుబిడ్డ. అతను చేస్తున్న ఈ చిత్రం చాలా గొప్ప హిట్ అయి యూనిట్ అందరికీ మంచి పేరు రావాలి అన్నారు.

నటి పవిత్ర లోకేష్ మాట్లాడుతూ.. క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ సినిమా చేస్తున్నారు ప్రసాద్ వర్మ. సిచువేషన్స్ కి తగ్గట్లుగా కంటెంట్ ఓరియెంటెడ్ ఫిలిమ్స్ వస్తున్న ఈ తరుణంలో అమ్మా నాన్న మధ్యలో మధురవాణి చిత్రం కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది. మంచి కథతో ఈ సినిమాని తీస్తున్నారు.. డెఫినెట్ గా ఈ చిత్రం అందరికీ కనెక్ట్ అవుతుంది.. అన్నారు.

చిత్ర నిర్మాత బృందాకర్ గౌడ్ మాట్లాడుతూ.. బేసిక్ గా మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం. ప్రసాద్ వర్మ చెప్పిన స్టోరీ నచ్చి ఈ సినిమా చేస్తున్నాను. మా అబ్బాయి గౌతమ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు అందరూ ఎంతో ఎంకరేజ్ చేస్తూ.. సపోర్ట్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా అందరూ కలిసి చూసే చిత్రం ఇది.. అన్నారు.

హీరో గౌతమ్ రాజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చిన మా దర్శకుడు ప్రసాద్ వర్మ కి థాంక్స్. మా డాడీ బృందాకర్ గౌడ్ నిర్మాతగా చేస్తున్నారు.. మంచి కథతో అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది.. అన్నారు.

సంగీత దర్శకుడు కార్తీక్ బి. కొడకండ్ల మాట్లాడుతూ.. ఈ సినిమాలో మ్యూజిక్ కి ఎంతో స్కోప్ ఉంది.. నా వంతు మంచి పాటలు చేయడానికి కృషి చేస్తాను.. అన్నారు.

పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే సినిమా పాటలు రాస్తున్నాను. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు నా థాంక్స్.. అన్నారు.

ఇక ఈ చిత్రంలో నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాం.. తప్పకుండా ఈ చిత్రం మాకు మంచి పేరు తెస్తుందని ఆశాభావంతో ఉన్నాం అని హీరోయిన్స్ అంబిక, మధు ప్రియ, లావణ్య శర్మ అన్నారు.
ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు ఛాయాగ్రహణం: వాసు, ఎడిటింగ్: శివ శర్వాణి, మాటలు: కుమార్ మల్లారపు, ఉదయ్ శర్మ, నాగమణి రాజు, సాహిత్యం: మిట్టపల్లి సురేందర్, ఆర్ట్: మోహన్-నరేష్, పి.ఆర్.ఓ: సురేష్ కొండేటి. ప్రొడ్యూసర్:బృంధాకర్ గౌడ్, కథ.స్క్రీన్ ప్లే.దర్శకత్వం: టి.డి.ప్రసాద్ వర్మ.