క్రికెట‌ర్ల‌కు అమ్మాయిలే పుడుతున్నారు.. మ‌హిళల జ‌ట్టు కోస‌మా: అమితాబ్

బాలీవుడ్ లెజండ‌రీ అమితాబ్ బ‌చ్చ‌న్ సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటార‌న్న విష‌యం తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు ఆయ‌న‌కు న‌చ్చిన విష‌యాల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌తో క‌నెక్ట్ అవుతూనే ఉంటారు. తాజాగా టీమ్ ఇండియా క్రికెట‌ర్లపై ఓ ట్వీట్ చేశారు బిగ్‌బి. అదేంటంటే.. టీంఇండియా క్రికెట‌ర్లంద‌రికీ అమ్మాయిలే పుడుతున్నారంటూ ట్వీట్ చ‌య‌డంతో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇటీవ‌లే టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- బాలీవుడ్ న‌టి అనుష్క‌శ‌ర్మ‌కు అమ్మాయి పుట్టిన విష‌యం తెలిసిందే.

amithab

ఈ నేప‌థ్యంలోనే దీనిపై స్పందించి టీంఇండియా క్రికెట‌ర్ల‌పై అమితాబ్ ట్వీట్ చేశారు. భార‌త మాజీ క్రికెట‌ర్స్ సురేశ్ రైనా, గౌత‌మ్ గంభీర్‌, రోహిత్ శ‌ర్మ‌‌, ష‌మీ, ర‌హానే, జ‌డేజా, పుజారా, సాహా, హ‌ర్భ‌జ‌న్‌సింగ్‌, న‌ట‌రాజ‌న్‌, ఉమేశ్ యాద‌వ్‌లంద‌రికీ అమ్మాయిలే పుట్టార‌ని బిగ్ బీ పేర్కొన్నారు. వీళ్లంతా భ‌విష్య‌త్తులో మ‌హిళ‌ల క్రికెట్ టీమ్‌ను త‌యారు చేస్తారా? అని ట్వీట్ చేశారు. అందులో ధోనీ కూతురు కెప్టెన్‌గా ఉంటుందేమో అంటూ చ‌మ‌త్క‌రించాడు అమితాబ్‌.