Bigb: బిగ్‌బి ఇంటికి భారీగా పోలీసుల‌ బందోబ‌స్త్‌..

Bigb: బాలీవుడ్ మెగాస్టార్ బిగ్‌బి అమితాబ్ బ‌చ్చ‌న్ నివాసానికి పోలీసులు భ‌ద్ర‌త పెంచారు. దేశంలో చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై స్పందించక పోవ‌డం అమితాబ్‌ను ఉద్దేశించి కాంగ్రెస్ నాయ‌కుడు నానా ప‌టోలే ఇటీవ‌లే చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో భ‌ద్ర‌త పెంచ‌డం గ‌మ‌నార్హం. Bigbఅమితాబ్ బ‌చ్చ‌న్ నిజ‌మైన హీరో కాదంటు ఆయ‌న వ్యాఖ్య‌నించారు. దీంతో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగానే భ‌ద్ర‌త‌ను పెంచిన‌ట్లు పోలీసులు తెలిపారు. కానీ భ‌ద్ర‌త పెంపున‌కు కార‌ణం ఏమిట‌న్న విష‌యం మాత్రం వెల్ల‌డించ‌లేదు.

amithabbachan

యూపీఏ హ‌యాంలో చ‌మురు ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు ట్వీట్లు చేసిన Bigbఅమితాబ్‌బ‌చ్చ‌న్‌, అక్ష‌య్‌కుమార్ ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నార‌ని ప‌టోలే విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. చ‌మురు ధ‌ర‌లు పెర‌గ‌డంపై Bigbఅమితాబ్ వంటి హీరోలు త‌మ తీరు ఏంటో చెప్ప‌క‌పోతే మ‌హారాష్ట్రలో వారి సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో పాటు షూటింగ్‌ల‌కు అనుమ‌తించ‌బోమ‌ని ప‌టోలే హెచ్చ‌రించాడు. ఈ హెచ్చ‌రిక తోనే పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం శివ‌సేనతో కాంగ్రెస్ భాగ‌స్వామిగా ఉంద‌ని విష‌యం తెలిసిందే.