అమితాబ్‌కు ఒక సినిమాకు రూ.21 కోట్ల రెమ్యూనరేషన్

దేశవ్యాప్తంగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ అంటే తెలియని వారు ఎవరూ ఊండరు. ఎంతోమంది అభిమానులు ఆయనకు ఉండరు. ఆయన బాలీవుడ్ హీరో అయినా అన్ని భాషల్లోనూ అమితాబ్‌కు అభిమానులు ఉన్నారు. ఒకప్పుడు హిందీ సినిమాల్లో నటించిన అమితాబ్.. ఇప్పుడు అన్ని భాషల్లోని సినిమాల్లో నటిస్తున్నారు. తెలుగులో పలు సినిమాల్లో అమితాబ్ గెస్ట్ రోల్ పాత్రలలో నటించిన విషయం తెలిసిందే. ఇక అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో అమితాబ్ ఒకరు.

AMITAB BACCHAN

అయితే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ‘మహానటి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న పాన్ ఇండియా సినిమాలో నటించేందుకు అమితాబ్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అమితాబ్ ఏకంగా రూ.21 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రియాంక దత్, స్వప్న కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలామందిని పరిశీలించిన అనంతరం అమితాబ్‌ను తీసుకున్నామని, ఇందులో ఫుల్ లెగ్త్ క్యారక్టర్‌లో అమితాబ్ నటించనున్నాడని చెప్పాడు. ఈ సినిమాకు అమితాబ్ న్యాయం చేస్తారని అనుకుంటున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపాడు.

ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం కానుంది. ఇటీవల కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా జనవరిలో ప్రారంభించనున్నట్లు ఇటీవల మేకర్స్ చెప్పారు. ఈ రెండు సినిమా షూటింగ్‌లు ఒకేసారి ప్రారంభం కానున్నాయి.