దర్శకుడి అవతారమెత్తనున్న అమీర్‌ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరోలు అమీర్‌ఖాన్, షారూఖ్ ఖాన్‌లు మరోసారి కలిసి నటించనున్నారు. గతంలో వీరిద్దరు కలిసి ‘పెహలా నషా’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఇప్పుడు లాల్ సింగ్ చద్దా అనే సినిమాలో ఇద్దరు మరోసారి కలిసి నటించనున్నారని తెలుస్తోంది. లాల్ సింగ్ చద్దా సినిమాలో అతిథి పాత్రలో షారూఖ్ ఖాన్ నటించనున్నాడట.

ఈ అతిథి పాత్రకు అమీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తాడట. 2007లో ‘తారే జమీన్ పార్’ అనే నాటకానికి అమీర్ దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలోని అతిథి పాత్ర కోసం మరోసారి అమీర్‌ఖాన్ దర్శకుడిగా మారుతున్నాడు.

హాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘ఫారెస్ట్ గంప్’ సినిమాకు రీమేక్‌గా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో షూటింగ్ జరుగుతోంది. ఇందులో కరీనా కపూర్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాను అద్వయిత్ చందన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ క్రిస్‌మస్‌కు విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వచ్చే క్రిస్‌మస్‌కు వాయిదా పడింది.