విజయ్ మోడీ అమెజాన్ లో రానున్నాడు!!

నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘క్లైమాక్స్‌’. న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ థియేటర్‌లో ప్రదర్శించిన ఘనత అందుకోవడంతో పాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ‘డ్రీమ్‌’ దర్శకుడు భవానీ శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి తొలి వారంలో థియేటర్లలో విడుదలైంది. విజయ్‌ మోడీగా రాజేంద్రప్రసాద్‌ నటన, భవానీ శంకర్‌ దర్శకత్వం ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో దక్కించుకుంది.

అమెజాన్‌లో ఏప్రిల్‌ మిడ్‌ వీక్‌ నుంచి ‘క్లైమాక్స్‌’ వీక్షకులకు అందుబాటులోకి రానుంది. ఓటీటీ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రేక్షకులు సినిమాను చూడవచ్చు.

సినిమాలో రాజేంద్రప్రసాద్‌ పాత్ర పేరు విజయ్‌ మోడీ కావడం, ‘మోడీ డౌన్‌ టౌన్‌’ డైలాగ్‌ వల్ల ట్రైలర్‌ విడుదలైన తర్వాత సినిమాపై సూపర్‌ బజ్‌ క్రియేట్‌ అయ్యింది. మిస్టరీ కామిక్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో దేశం నుంచి పారిపోయిన వ్యాపారవేత్తలపై సెటైర్లు ఉన్నాయి. అందువల్ల, ఓటీటీలో సినిమా ఎప్పుడొస్తుందోనని ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. త్వరలో వాళ్ల ముందుకు ‘క్లైమాక్స్‌’ను తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.