ఆమె పార్ట్ 2నా లేక ఆమె శృతి మించుతుందా?

అక్కినిని హీరో సినిమాతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ అమలా పాల్. మెగా పవర్ స్టార్ నాయక్ సినిమాలో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్, ఆశించిన స్థాయిలో అవకాశాలని మాత్రం తెచ్చుకోలేకపోయింది. తిరిగి మళయాళంలోనే సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఆమె, రీసెంట్ గా ఆమె సినిమాలో నగ్నంగా నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది కానీ ఆమె సినిమా కమర్షియల్ సక్సస్ మాత్రం కాలేకపోయింది. దీంతో మరో సినిమా మొదలుపెట్టడానికి టైం ఉందో లేక సోషల్ మీడియా ఫ్యాన్స్ మర్చిపోకూడదు అనుకుందో తెలియదు కానీ నెట్ లో బాగా యాక్టివ్ గా ఉండే అమలా పాల్, వరస ఫొటోస్ తో అలరిస్తూ ఉంటుంది. రీసెంట్ గా ఈ మలయాళ ముద్దుగుమ్మ బాత్ టబ్ లో, పూల మధ్య కూర్చొని పెట్టిన ఫొటోస్ యూత్ లో హీట్ పెంచుతోంది. ముఖ్యంగా బ్యాక్ లెస్ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన వాళ్లలో కొంతమంది ఆమె పార్ట్ 2నా అని అడుగుతుంటే మరి కొందరు మాత్రం డివోర్స్ తర్వాత అమలా స్కిన్ షోలో శృతి మించుతోంది అంటున్నారు.