యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఆల్ఫా గర్ల్స్

యష్‌రాజ్‌ఫిల్మ్స్ స్పై యూనివర్శ్‌లో ఫస్ట్ ఫీమేల్‌ లీడ్‌గా బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ ఆలియాభట్‌ అరుదైన ఘనత దక్కించుకున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో రెయిజింగ్‌ స్టార్‌, యష్‌రాజ్‌ ఫిల్మ్స్ హోమ్‌ గ్రోన్‌ టాలెంట్‌ శార్వరి ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. వారిద్దరూ స్పై యూనివర్శ్‌లో సూపర్‌ ఏజెంట్స్ గా కనిపించనున్నారు. ఈ స్పెషల్‌ ప్రాజెక్టులో వాళ్లిద్దరినీ ఆల్ఫాగర్ల్స్ గా పరిచయం చేయనున్నారు ఆదిత్య చోప్రా.
యష్‌రాజ్‌ఫిల్మ్స్ సంస్థలో ఆలియా, శార్వరి నటిస్తున్న సినిమాకు ‘ఆల్ఫా’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆల్ఫా అనే టైటిల్‌కి మగవారు మాత్రమే కాదు, మహిళలూ అర్హులే అని సమాజానికి గట్టిగా చాటి చెప్పాలనే ధ్యేయంతో ఈ టైటిల్‌ని ఖరారు చేశారు ఆదిత్య చోప్రా.

టైటిల్‌ రివీల్‌ వీడియాలో ఆలియా చెప్పిన డైలాగ్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ”గ్రీక్‌ ఆల్ఫబెట్‌లో మొదటి అక్షరం, మన ప్రోగ్రామ్‌ మోటో, అన్నిటికన్నా ముందు, అన్నిటికన్నా వేగం, అన్నిటికన్నా స్థైర్యం… నిశితంగా గమనించండి… ప్రతి నగరం ఒక అడవే. ప్రతి అడవినీ ఏలేది.. అల్ఫా!” అంటూ ఆలియా చెప్పిన డైలాగ్‌ ఇన్‌స్టంట్‌గా వైరల్‌ అవుతోంది.