Uppena: ఉప్పెన టీంను అభినందించిన స్టైలిష్‌స్టార్‌..

Uppena: మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌, డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ఉప్పెన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇందులో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. దీంట్లో కృతి త‌న అందంతో పాటు అభినయంతో ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. అలాగే ప్ర‌ముఖ కోలీవుడ్ స్టార్ మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి ఈ చిత్రంలో విల‌న్ పాత్ర‌ను చేసి ఈ చిత్రానికి హైప్ తీసుకొచ్చారు. Uppenaఇందులో ఆయ‌న వైవిధ్య‌మైన న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

Uppena

దీంతో ఈ చిత్రం మంచి విజ‌యంతో ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖులు ఉప్పెన చిత్ర‌బృందాన్ని అభినంద‌న‌లు తెలిపారు. ఇక తాజాగా ఈ Uppenaసినిమాను స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ వీక్షించి.. చిత్ర‌బృందాన్ని అభినందించాడు. ఉప్పెన సినిమా చాలా బాగుందంటూ చిత్ర‌బృందాన్ని అభినందించారు. ద‌ర్శ‌కుడ్ని, హీరో వైష్ణ‌వ్‌తేజ్‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. ఈ క్ర‌మంలో ఉప్పెన Uppena చిత్ర‌బృందం బ‌న్నీకి ఓ మొక్క‌ను బ‌హుక‌రించారు. ఇక అల్లుఅర్జున్ ప్ర‌స్తుతం పుష్ప చిత్రంతో బిజీగా ఉన్నాడు .. ఇటీవ‌లే ఈ చిత్ర షూటింగ్ త‌మిళ‌నాడులో జ‌రుపుకుని హైద‌రాబాద్‌కు వ‌చ్చేసింది.