Alluarjun: అల్లుఅర్జున్‌, కొర‌టాల శివ కాంబో మూవీకి రంగం సిద్ధం..

Alluarjun: అల్లుఅర్జున్ ప్ర‌స్తుతం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ డైరెక్ష‌న్ చేస్తున్న పుష్ఫ‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం అనంతరం త‌న త‌ర్వాత ప్రాజెక్ట్‌పై దృష్టి సారించాడు అల్లుఅర్జున్‌. ప్ర‌స్తుతం పుష్ప చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఇందులో బ‌న్నీకి జోడీగా ర‌ష్మికామంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా, అగ‌ష్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఇక ఈ చిత్రం అనంత‌రం Alluarjunబ‌న్నీ..

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో ఏఏ 21 వ‌ర్కింగ్ టైటిల్‌తో గ‌తేడాదిలోనే ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో యువ‌సుధ ఆర్ట్స్ ప‌తాకంపై సుధాక‌ర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ చిత్రంపై ఓ అప్‌డేట్ ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయ‌ని, త్వ‌ర‌లో చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంద‌ని వార్తాలు వెలువ‌డుతున్నాయి. అయితే ప్ర‌స్తుతం కొర‌టాల శివ మెగాస్టార్ ఆచార్య సినిమాను కంప్లీట్ చేసే పనిలో నిమ‌గ్న‌మ‌యి ఉన్నాడు. అలాగే Alluarjunబ‌న్నీ పుష్ప చిత్రంను కంప్లీట్ చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌యి ఉన్నాడు. ఇవీ కంప్లీట్ కాగానే వీరి కాంబో రంగం సిద్దం చేసుకుంటుంది.