అద్దం చాటున… అనుతో అల్లూ వారబ్బాయి ముద్దులు…

కెరీర్ స్టార్ట్ చేసి 8 ఏళ్లు అవుతున్నా అయిదు సినిమాలు మాత్రమే చేసినా అల్లువారి చిన్నబ్బాయి శిరీష్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. దాదాపు రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శిరీష్, తన ఆరో సినిమా డీటెయిల్స్ అనౌన్స్ చేశాడు. అను ఎమ్మానుయేల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని శిరీష్ పుట్టిన రోజు సంధర్భంగా మే 30న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ బయటికి వచ్చిన పోస్టర్ చాలా బాగుంది. అద్దంకి రెండు చేతులు అడ్డం పెట్టి, ఆ చేతుల చాటున హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శిరీష్ సిక్స్ ప్యాక్ చూపించే అవకాశం ఉంది. విజేత, జతకలిసే సినిమాలని డైరెక్ట్ చేసిన రాకేశ్ శశి ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహిస్తున్నాడు.

మే 30న “శిరీష్‌ బర్త్‌డే ” న ఉదయం 11 గంటలకు ఫస్ట్‌ లుక్‌ విడుదల కానున్న ఈ మూవీని గీత ఆర్ట్స్ 2 ప్రొడ్యూస్ చేస్తుంది. కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు తర్వాత శిరీష్ ఓన్ బ్యానర్ లో చేస్తున్న మూడో సినిమా ఇది. ఇప్పటి వరకు రొమాన్స్‌ జోలికి పెద్దగా వెళ్లని శిరీష్‌, ఈసారి మాత్రం ప్రీలుక్ లోనే లిప్‌ లాక్‌ ఇచ్చినట్లు చూపించేశాడు. మరి ఆ అద్దంకి అవతలివైపు లీడ్ పెయిర్ రొమాన్స్ ఎలా ఉందో తెలియాలి అంటే మే 30 వరకూ ఆగాల్సిందే.