అయాన్ క్రేజ్ చూస్తుంటే… ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయాన్ ని తీసుకొస్తా : అల్లు శిరీష్

అల్లు శిరీష్ హీరోగా తమిళ్ నటుడు అజ్మల్ ప్రతినాయకుడిగా వస్తున్న సినిమా బడ్డీ. గాయత్రీ భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్, ముఖేష్ కుమార్, అలీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. శ్యామ్ ఆంటోనీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను కేఈ జ్ఞానవేల్ రాజా, అధన్ జ్ఞానవేల్ రాజా కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందించారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ చేసారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ హైదరాబాద్లోని AAA మాల్ లో ట్రైలర్ లాంచ్ జరిగింది.

ఈ ఈవెంట్ లో అల్లు శిరీష్ మాట్లాడుతుండగా అక్కడికి వచ్చిన ఫాన్స్ అంత అయాన్… అయాన్ అని అరిహరు. ఆ అరుపులు విన్న అల్లు శిరీష్ ఆశ్చర్యపోయారు. అయాన్ కు ఇంత క్రేజ్ ఉందా అంటూ నవ్వుకున్నారు. బడ్డీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అయాన్ ను తప్పకుండ తీసుకొస్తాను అని అన్నారు. ఇది ఇలా ఉండగా ఫాన్స్ మరోసారి బన్నీ అని అరిచారు. దానితో శిరీష్ అన్నయ్యను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాను కానీ కచ్చితం అని చెప్పలేను అని అన్నారు.