డైరెక్టర్ మారుతి బర్త్ డే.. అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ స్పెషల్ బర్త్ డే విషెస్

సరికొత్త కామెడీ కథలతో సరికొత్తగక్ ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు మారుతి నేడు 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ రోజుల్లో, బస్ స్టాప్, ప్రేమా కథా చిత్రమ్, భలే భలే మగడివోయ్, మహనుభావుడు, మరియు ప్రతి రోజు పండగే వంటి సినిమాలతో మారుతి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రెటీలు ఆయనకు స్పెషల్ బర్త్ డే విషెస్ అందించారు.

అల్లు అర్జున్ ఒక పాత ఫోటోతో మారుతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ” నా పాత స్నేహితుడు, శ్రేయోభిలాషి & దర్శకుడు మారుతికి చాలా సంతోషకరమైన విజయాలు అందాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు. ఇక లావణ్య త్రిపాఠి చిత్రనిర్మాతకు శుభాకాంక్షలు తెలిపారు. ” సూపర్ టాలెంటెడ్ మరియు స్వీట్ -డైరెక్టర్ మారుతి సార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు ” అని పేర్కొంది. ఇక వెన్నెలా కిషోర్, యువ హీరో సాయి ధరమ్ తేజ్ వంటి వారు కూడా ఈ కామెడీ దర్శకుడికి ఎమోషనల్ గా విశేస్ అందించారు. సాయి ధరమ్ తేజ్ ఈ వైడ్
” నా డార్లింగ్ డైరెక్టర్ మారుతి అన్నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చాలా విషయాల్లో మీకు ధన్యవాదాలు చెప్పాలి. కొన్ని కష్ట సమయాల్లో నాతో పాటు నిలబడినందుకు ధన్యవాదాలు. మీతో గడిపిన సమయాన్ని ఎప్పటికీ మరచిపోలేను. నేను లెక్కలేనన్ని సార్లు నవ్వుతాను … లవ్ యు అన్నా. ” అంటూ సాయి ధరమ్ తేజ్ వివరణ ఇచ్చారు