Alluarjun: అల్లుఅర్జున్ “పుష్ప”‌లో చెల్లెలిగా టాలీవుడ్ హీరోయిన్‌..

Alluarjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఇందులో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్తా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌లు చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించిన మేఘా ఆకాశ్ ఇప్పుడు పుష్ప చిత్రంలో Alluarjunఅల్లు అర్జున్ చెల్లెలిగా న‌టించ‌నుంద‌ని స‌మాచారం. ఇక ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల్లో మారేడుమిల్లిలో జ‌రుగుతుంది.

ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా.. పాన్ ఇండియా స్థాయి సినిమాగా తెర‌కెక్కుతున్న Alluarjunఈ చిత్రాన్ని ఆగ‌ష్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్న‌ట్లు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది. ఈ Alluarjunచిత్రానికి దేవీశ్రీ‌ప్ర‌సాద్ స్వ‌రాలు అందిస్తున్నారు. కాగా మేఘా ఆకాశ్ గురించి.. నితిన్ న‌టించిన లై చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచ‌య‌మైంది. ఆ త‌ర్వాత మ‌రోసారి నితిన్‌తో ఛ‌ల్ మోహ‌న్‌రంగ‌లో హీరోయిన్‌గా చేసింది. ప్ర‌స్తుతం తెలుగులో మ‌ను చ‌రిత్ర‌, గుర్తుందా శీతాకాలం చిత్రాల్లో మేఘా ఆకాశ్ ఓ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తోంది.