బన్నీ తర్వాతి సినిమా ఆ డైరెక్టర్‌తోనే?

స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రానున్న మూడో సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఇందులో ఎర్రచందనం స్మగ్లర్‌గా బన్నీ నటిస్తుండగా.. రష్మిక మందన్నా గిరిజన యువతి పాత్రలో నటిస్తోంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తారనేది ఇంకా కన్ఫామ్ కాలేదు.

allu arjun next movie

తాజాగా బన్నీ తర్వాతి సినిమా గురించి ఒక వార్త హాట్‌టాపిక్‌గా మారింది. పుష్ప తర్వాత గౌతమ్ మీనన్ దర్శఖత్వంలో అల్లు అర్జున్ సినిమా చేయనున్నాడట. పోలీస్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కనుందట. త్వరలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.