పవన్ చరణ్ లని గుర్తు చేస్తున్న అల వైకుంఠపురములో అల్లు అర్జున్

నా పేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్, ఏడాదిన్నర తర్వాత తన సినిమాని అనౌన్స్ చేశాడు. తనకి రెండు హిట్స్ ఇచ్చిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి అల వైకుంఠపురములో సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఈ మూవీ కోసం తన లుక్ ని కంప్లీట్ చేస్తున్నాడు. జెట్ స్పీడ్ లో షూటింగ్ చేస్తున్న బన్నీ చేస్తున్న అల వైకుంఠపురములో సినిమాని సంక్రాంతి రేస్ లో నిలబెట్టాడు. జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్, ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. తలకి పాగా, ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో కోడిపుంజుతో అల్లు అర్జున్ పర్ఫెక్ట్ సంక్రాంతి హీరోలా ఉన్నాడు.

ఈ పోస్టర్ ని చూసిన మెగా అభిమానులు మాత్రం అల్లు అర్జున్ ని చూస్తుంటే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నారు అంటున్నారు. ఎందుకంటే కాటమరాయుడు సినిమా రిలీజ్ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పంచకట్టుకోని కోడి పట్టుకోని నిలబడిన పోస్టర్ బయటకి వచ్చిన సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీని తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సూపర్ హిట్ సినిమా రంగస్థలం సినిమా నుంచి ఇండిపెండెన్స్ డేకి ఒక పోస్టర్ బయటకి వచ్చింది. అందులో కూడా రామ్ చరణ్ ఒక కోడిని పట్టుకోని ఉండడంతో మెగా అభిమానులు ఆ పోస్టర్ ని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రంగస్థలం, కాటమరాయుడు సినిమా పోస్టర్స్ రెండింటిలో మెగా హీరోలు పంచకట్టుకోని ఉండగా బన్నీ మాత్రం కాస్త అప్డేట్ వెర్షన్ లా కనిపిస్తున్నాడు. సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు.