పొలిటీషియన్‌గా అల్లు అర్జున్

వరుస విజయాలతో దూసుకెళ్తున్న డైరెక్టర్ కొరటాల శివతో స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్‌తో బన్నీ ‘పుష్ప’ సినిమాతో చేస్తుండగా.. ఇది పూర్తైన తర్వాత కొరటాల శివతో చేయనున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇటీవలే ఒక పోస్టర్‌ను రిలీజ్ చేసి ఈ సినిమాఅధికారిక ప్రకటన చేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది.

allu arjun

ఈ సినిమా స్టోరీ లైన్, అల్లు అర్జున్ పాత్రకు సంబంధించిన డీటైల్స్ బయటపడ్డాయి. రాజకీయ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో ఫస్టాప్‌లో అల్లు అర్జున్ స్టూడెంట్ లీడర్‌గా కనిపిస్తాడని, సెకండాఫ్‌లో పొలిటీషియన్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం బలమైన కథను కొరటాల శివ సిద్ధం చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో పాన్ ఇండియా సినిమాగా పుష్ప సినిమా తెరకెక్కుతోంది. ఇది కూడా బలమైన కథనే. ఇది చాలా డిఫరెంట్ కథ కాగా.. ఇందులో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ కనిపించనున్నాడు. ఆయన సరసన రష్మిక మందాన తన అందాలతో మ్యాజిక్ చేయనుంది.