అల్లు అర్జున్‌కి అరుదైన ఘనత

టాలీవుడ్‌లో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకడు. సినిమాకు సినిమాకు వేరిషయన్స్ చూపిస్తూ తన స్ట్రైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ఇక టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ డ్యాన్సర్లలో అల్లు అర్జున్ ఒకడు. టాలీవుడ్‌లో భారీ క్రేజ్ ఉన్న అల్లు అర్జున్‌కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో ‘పుష్ప’ సినిమా చేస్తున్న అల్లు అర్జున్.. తాజాగా అరుదైన ఘనత సాధించాడు.

ALLU ARJUN

భారతదేశంలో అత్యధిక మంది సెర్చ్ చేసిన టాప్-10 సినీ సెలబ్రెటీలలో అల్లు అర్జున్ పదో స్థానంలో ఉన్నాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో అమితాబ్ బచ్చన్, మూడో స్థానంలో అక్షయ్ కుమార్, నాలుగో స్థానంలో సల్మాణ్, ఐదో స్థానంలో ఇర్పాన్ ఖాన్ ఉన్నారు. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణం ఏడవ స్థానంలో ఉండగా.. సోనూసూద్ తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు.

దక్షిణ భారతదేశం నుంచి ఈ ఏడాది ఎక్కువమంది సెర్చ్ చేసిన ఏకైక మేల్ స్టార్‌గా అల్లు అర్జున్ నిలిచాడు. లాక్‌డౌన్‌కు ముందు విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమాలోని ‘బుట్టబొమ్మ’ సాంగ్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ పాటను చూసేందుకు చాలామంది నెట్‌లో వెతికారు. అందువల్లనే బన్నీకి ఈ ఘనత దక్కిందని తెలుస్తోంది. అటు ఓటీటీలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా సరే ఓటీటీ స్టార్లకు పెద్దగా ప్రాధాన్యత లేదని గూగుల్ సర్వేలో తేలింది.