అల… అక్టోబర్ లో వస్తున్నారు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూడో చిత్రం అల.. వైకుంఠపురములో… . శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ని త్రివిక్రమ్ బర్త్ డే సంధర్భంగా నవంబర్ 7న రిలీజ్ చేయనున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అయితే తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురములో సినిమా టీజర్ ని నవంబర్ 7 కన్నా ముందే అక్టోబర్ 8న దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్గే నటిస్తున్న ఈ చిత్రంలో టబు, జయరాం, నివేదిత పేతురాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న అల వైకుంఠపురములో సినిమాని మొదటిసారి హారికా, హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు తెరకెక్కాయి. ఈ రెండు చిత్రాలు సూపర్ డూపర్ హిట్ సాధించాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేనషన్‌లో వస్తున్న మూడో చిత్రం అల.. వైకుంఠపురములో.. కూడా సూపర్ డూపర్ హిట్ సాధిస్తుందని స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది.