Allari Naresh: “బంగారు బుల్లోడు”పై ఫిర్యాదు చేసిన స్వ‌ర్ణ‌కార సంఘం!

Allari Naresh: అల్ల‌రి న‌రేశ్‌-పూజా జ‌వేరీ హీరో హీరోయిన్లుగా న‌టించిన బంగారు బుల్లోడు చిత్ర ట్రైల‌ర్‌ను ఇటీవ‌లే రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్ర క‌థాంశం ఏంటంటే.. ఈ సినిమాలో హీరో గోల్డ్‌స్మిత్‌. గ్రామీణ బ్యాంక్‌లో బంగారంపై వ‌డ్డీకి డ‌బ్బులు ఇచ్చే ఉద్యోగి. సినిమా మొత్తం బంగారం మీదే ఉంటుందని ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. అయితే ఈ చిత్రం విడుద‌ల‌కు రెండు రోజులు ఉంద‌న‌గా ఇప్పుడు ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది.

Allari Naresh Bangaru bullodu

ఈ సినిమాలోని కొన్ని స‌న్నివేశాల‌పై స్వ‌ర్ణ‌కార సంఘాలు అభ్యంత‌రం వ్య‌క్తం చేశాయి. త‌మ వృత్తిని కించ‌ప‌రిచేలా చూపించిన కొన్ని సీన్ల‌ను సినిమాలోంచి తొల‌గించాల‌ని కోరుతూ తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్వ‌ర్ణ‌కార సంఘాలు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌కు ఫిర్యాదు చేశాయి. ఈ మేర‌కు గురువారం స్వ‌ర్ణ కార సంఘాలు విన‌తి ప‌త్రాలు అంద‌జేశాయి. ఒక‌రి బంగారు ఆభ‌ర‌ణాల‌ను వేరొక‌రి వేడుక‌లకి స్వ‌ర్ణ‌కారులు ఇవ్వ‌ర‌ని.. Allari Naresh అలా ఇస్తున్న‌ట్టు ట్రైల‌ర్‌లో చూపించి స్వ‌ర్ణ‌కారుల‌ను కించ‌ప‌రిచార‌ని ఏపీ స్వ‌ర్ణ‌కార సంఘం అధ్య‌క్షుడు క‌ర్రి వేణుమాధ‌వ్ పేర్కొన్నారు. ఇక ఈ చిత్రాన్ని గిరి. పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రం నిర్మించ‌గా.. ఈ నెల 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.