బాల‌య్య‌కు థ్యాంక్స్ చెప్పిన అల్ల‌రి న‌రేశ్‌!

అల్ల‌రి న‌రేశ్ తాజా చిత్రం బంగారు బుల్లోడు ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా హీరో న‌రేశ్ మాట్లాడుతూ.. కరోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితు వ‌ల్ల సినీ ఇండ‌స్ట్రీ ఎంతో న‌ష్ట‌పోయిందని, ఆ త‌ర్వాత సంక్రాంతికి సినిమాలు రిలీజ్ అయి బాగా ఆడుతున్నాయి. మా అంద‌రికీ చాలా న‌మ్మ‌కం క‌లిగింది. బంగారు బుల్లోడు జ‌న‌వ‌రి 23తేదీన రిలీజ్ అవుతుంద‌ని..

balakrishna, allari naresh

క‌థ‌లో కామెడీతో పాటు ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు గిరి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఒక మంచి సినిమాతో వ‌స్తున్నామ‌ని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నామ‌ని, ఎంతో ఎగ్జైట్‌గా ఉంద‌ని అన్నారు. అలాగే గ‌తంలో బాల‌కృష్ణ హీరోగా తెర‌కెక్కిన చిత్రం టైటిల్ కూడా బంగారు బుల్లోడు. కాగా ఈ చిత్రానికి, మా చిత్రానికి ఎలాంటి సంబంధం లేదు. ఒక బంగారు షాప్‌లో వ‌ర్క్ చేస్తూ.. గ్రామీణ బ్యాంక్‌లో ప‌నిచేసే వాడి క‌థాంశంతో తెర‌కెక్కుతుంది ఈ చిత్రం. బంగారు తాక‌ట్టు పెట్టుకుని రుణాలు ఇస్తుంటాడు.. అందుకే ఈ సినిమాకు బంగారు బుల్లోడు టైటిల్ పెట్ట‌డం జ‌రిగింద‌ని న‌రేశ్ అన్నారు. అదేవిధంగా ఈ టైటిల్‌ను అడ‌గ్గానే ఏమి ఆలోచించ‌కుండా ఇచ్చిన బాల‌కృష్ణ గారికి, డైరెక్ట‌ర్, నిర్మాత గారికి ధ‌న్య‌వాదాలు తెలిపారు అల్ల‌రి న‌రేశ్‌. ఇక ఈ చిత్రాన్ని ఏటీవీ స‌మర్ప‌ణ‌లో ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై గిరి పాలిక ద‌ర్శ‌క‌త్వంలో రామబ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు. ఈ సినిమాలో అల్ల‌రి న‌రేశ్ స‌ర‌స‌న పూజా జ‌వేరి హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.