Aliyabhat: క‌రోనా బారిన ప‌డ్డ ఆలియా బ్యూటీ.. మ‌రీ ఆర్ఆర్ఆర్ టీమ్ సంగ‌తి!

Aliyabhat: కరోనా వైర‌స్ మ‌ళ్లీ విజృంభిస్తుంది.. ఈ నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా కేసులు భారీగా న‌మోద‌వుతున్నాయి.. ఈ క్ర‌మంలో సామాన్యుల నుంచి సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ అమీర్‌ఖాన్‌, ర‌ణ్‌బీర్‌క‌పూర్‌, కార్తీక్ ఆర్య‌న్‌, ప‌రేశ్ రావెల్‌, మాధ‌వ‌న్‌, మ‌నోజ్ బాజ్‌పేయి క‌రోనా బారిన ప‌డ్డారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్ర బ్యూటీ ఆలియా భ‌ట్ క‌రోనా బారిన ప‌డింది.

ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా సోష‌ల్ మీడియాలో తెలుపుతూ.. నాకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఫ‌లితం తెలిసిన వెంట‌నే హోంఐసోలేష‌న్‌లో ఉన్నాను.. వైద్యుల సూచ‌న‌లు పాటిస్తున్నాను.. మీ అంద‌రి ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు, ద‌య‌చేసి అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి అంటూ ఆమె పేర్కొంది. కాగా ఆమె న‌టిస్తున్న తాజా చిత్రాలు ఆర్ఆర్ఆర్, గంగూభాయ్ క‌తియావాడి, బ్ర‌హ్మాస్త్ర.‌ ‌