RRR: ఆలియా అడిగిందని అవకాశ‌మిచ్చాడ‌ట రాజ‌మౌళి..

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో చేయాలని ఎంతో మంది న‌టీ న‌టీనటులు కోరుకుంటారు. స్టార్ హీరోల సైతం రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లోచేయాల‌నుకుంటారు. కాగా రాజ‌మౌళి ప్ర‌స్తుతం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్‌కు అవ‌కాశం ఇచ్చాడు. ఈ అవ‌కాశం ఎలా వ‌చ్చిందనే విష‌యాన్ని ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపింది ఆలియా. ఒక‌రోజు ఎయిర్‌పోర్టులో రాజ‌మౌళిని క‌లిసిన‌పుడు ఆర్ఆర్ఆర్ RRR చిత్రంలో ఏదైనా క్యారెక్ట‌ర్ చేయాల‌ని ఉంది..

Aliya

ఎలాంటి పాత్ర ఇచ్చినా చేస్తా అని నిర్మొహ‌మాటంగా అడిగింద‌ట‌. ఆ స‌మ‌యంలో స‌రే అన్నRRR రాజ‌మౌళి..కేవ‌లం 10రోజుల‌కే ఆర్ఆర్ఆర్ చిత్రంలో సీత పాత్ర చేయ‌మ‌ని అడిగార‌ని చెప్పుకొచ్చింది. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో త‌న‌కు సీత పాత్ర‌ను చేయ‌డానికి అవ‌కాశం వ‌చ్చింద‌ని తెలిపింది ఆలియా. ఇక ఈ RRR చిత్రంలో రాంచ‌ర‌ణ్ కు జోడీగా ఆలియా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.‌‌ ‌