దేవుడు మనకు ఎదో రూపంలో మనకు మంచి చేస్తాడు అని చెప్పే కథే “అలిపిరికి అల్లంత దూరంలో’ మూవీ రివ్యూ

“అలిపిరికి అల్లంత దూరంలో’’ మూవీ రివ్యూ

సినిమా : ‘’అలిపిరికి అల్లంత దూరంలో’”

రిలీజ్ డేట్,: 18/11/22

నటీనటులు:  రావణ్ నిట్టూరు,  శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ, వేణుగోపాల్

టెక్నికల్ టీం :
దర్శకత్వం: – ఆనంద్ జె
నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి
బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్
డీవోపీ: డిజికె
సంగీతం : ఫణి కళ్యాణ్
ఎడిటర్ : సత్య గిడుతూరి
పీఆర్వో : తేజస్వి సజ్జా

కాస్కేడ్ పిక్చర్స్ పతాకంపై నూతన నటుడు రావణ్ నిట్టూరు కధానాయకుడిగా శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.నూతన నటీనటులతో రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మించిన యూనిక్ రాబరీ థ్రిల్లర్ చిత్రం ‘అలిపిరికి అల్లంత దూరంలో’. నవంబర్ 18న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ
తిరుపతిలో ఉండే మిడిల్ క్లాస్ అబ్బాయి వారది (రావణ్ నిట్టూరు) కు ఫైనాన్సియల్ గా ఎన్నో ప్రొబ్లెమ్స్ ఉన్నందున చిన్న చిన్న మోసాలు చేస్తూ వెంకటేశ్వర స్వామి పటాలు అమ్మే షాప్ రెంట్ కు తీసుకొని మెయింటైన్ చేస్తుంటాడు. అక్కడే వెంకటేశ్వర గోశాలలో వాలెంటరీగా పని చేసే ధనవంతుల కుమార్తె కీర్తి ( శ్రీ నికిత) ను చూసి ప్రేమిస్తాడు. ఇద్దరూ లవ్ చేసుకున్న విషయం తెలుసుకున్న కీర్తి తండ్రి వారది షాప్ కు వచ్చి నీకు చదువు లేకపోయినా , డబ్భైనా ఉంటే నా కూతురిని ఇచ్చే వాడిని నీకు డబ్బు లేదు, నా కూతురి జోలికి రావద్దని వార్నింగ్ ఇచ్చి వెళతాడు. దాంతో బాగా డబ్బు సంపాదించి కీర్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. ఇలాంటి ఫైనాన్సియల్ క్రైసస్ లో ఉన్న వారది కి వెంకటేశ్వర స్వామికి 2 కోట్ల ముడుపుల మొక్కు చెల్లించుకోవడానికి వచ్చిన యాత్రికుడి కుటుంబం గురించి తెలుసుకొని ఆ రెండు కోట్లు కొట్టేస్తే తిరుమల లో షాప్ పెట్టుకొని, కీర్తిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వచ్చు అనుకుంటాడు.ఆ రెండు కోట్లను దొంగతనం చెయ్యాలని ప్లాన్ చేసుకున్న తరువాత తను అనుకోకుండా చాలా విషయాల్లో ఇరుక్కొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాటినుండి వారధి ఎలా ఎదుర్కొన్నాడు, ఆ తరువాత జరిగిన పరిణామాలు ఏంటి ? వీటన్నిటినీ వెంకటేశ్వర స్వామి ఎలా గేమ్ ప్లాన్ చేశాడు, అలాగే యాత్రికుడు మొక్కుకున్న ముడుపులు మొక్కు చెల్లించు కున్నాడా లేదా ? చివరకు వారధి తిరుమలలో షాప్ ను సొంతం చేసుకుని కీర్తిని పెళ్లి చేసుకోవాలనే కలను నెరవేర్చుకొన్నాడా లేదా? అనేది తెలుసుకోవాలంటే ‘అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా చూడాల్సిందే

నటీ నటుల పనితీరు
వారధి పాత్రలో రావణ్ నిట్టూరు కిది తొలి చిత్రమైనా చాలా న్యాచురల్ గా చాలా చక్కగా నటించాడు.కీర్తి పాత్రలో శ్రీ నికిత ఉన్నంతలో చక్కటి పెర్ఫార్మన్స్ చూపించింది.హోటల్ బిజినెస్ మ్యాన్ గా బొమ్మకంటి రవీందర్ , ముడుపులు మొక్కు కచ్చితంగా తీర్చుకోవాలి అని పట్టుబట్టిన పాత్రలో నటించిన అమృత వర్షిణి సోమిశెట్టి , హీరోయిన్ కీర్తి తల్లి తండ్రులు గా జయచంద్ర, తులసి లు, వారధి తల్లి పాత్రలో లహరి గుడివాడ నటించి అందరినీ మెప్పించింది. ఒక వ్యక్తి దగ్గర డబ్బుని దొంగలించిన కారణంగా తను చేసిన తప్పులకు పక్ష పాతం వచ్చి మంచానికే పరిమితమైన హీరో తండ్రిగా వేణుగోపాల్, హరిదాసు పాత్రలో శతావధాని మురళి, హీరో ఫ్రెండ్ గా యం. యస్ ఇలా అందరూ చాలా అనుభవం వారిలా పోటీ పడి నటించడమే కాకుండా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులపనితీరు
తిరుమలలో ఒక షాపు సంపాయించుకోవాలని చూసే ఒక యువకుడి జీవితంలో జరిగిన సంఘటనలను ఇతివృతం గా తీసుకొని రాబారీ డ్రామాలో డివైన్ ఎలిమెంట్ థ్రిల్లింగ్ అంశాలతో మంచి కథ ను సెలెక్ట్ చేసుకొని కొత్తవాళ్ళతో కూడా మంచి సినిమా తీయొచ్చని దర్శకుడు ఆనంద్ జె ఈ సినిమా ద్వారా నిరూపించాడు. సినిమా చూస్తుటే అంతా తిరుపతి పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్ లతో పాటు తిరుపతిలో యాత్రికుల మధ్య షూటింగ్ చేస్తూ తిరుపతి నేటివిటీని అద్భుతంగా చూపించారు.అలాగే ఈ చిత్రంలో ప్రతి సీన్ లో వేంకటేశ్వర స్వామీ రిఫరెన్స్ కనిపిస్తుంది.మ్యూజిక్ డైరెక్టర్ ఫణి కళ్యాణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.తెలుపనా తెలిపనా సాంగ్, మా తిరుపతి సాంగ్ లు బాగున్నాయి  డీవోపీ డిజికె బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. కిట్టువిస్సాప్రగాడ లిరిక్స్ బాగున్నాయి..సత్య గిడుతూరి ఎడిటింగ్ పనితీరు బాగుంది , నిర్మాతలు రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర లకు నిర్మాణంలో కొత్త అయినప్పటికీ ఖర్చుకు వెనుకడకుండా చాలా బాగా నిర్మించారు. థ్రిల్లర్ తో పాటు ప్యామిలీ ఎలిమెంట్స్ తో డివైన్ టచ్ వున్న ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది “అలిపిరికి అల్లంత దూరంలో’ సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా కనెక్ట్ అవుతుంది అని చెప్పచ్చు