Aliya Bhat: ‘ఆర్ఆర్ఆర్’ సీత లుక్ రిలీజ్‌..

Aliya Bhat: ద‌ర్శ‌క‌దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే కొమురం భీం తార‌క్‌, అల్లూరి సీత‌రామ‌రాజు చ‌ర‌ణ్ టీజ‌ర్లు ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకున్నాయి. తార‌క్ జోడీగా హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరీస్ న‌టిస్తుండ‌గా.. చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ Aliya Bhat ఆలియాబ‌ట్ న‌టిస్తుంది. ఇప్ప‌టికే ఒలివియా మోరీస్ ఫ‌స్ట్‌లుక్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఆక‌ట్టుకుంది. ఇక Aliya Bhat ఆలియా భ‌ట్ లుక్ కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న క్ర‌మంలో తాజాగా ఆలియా ఫ‌స్ట్‌లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం.

Aliya first look

ఇందులో ఆలియా సీత‌గా న‌టించ‌నుంది. ఈ పోస్ట‌ర్‌లోAliya Bhat ఆలియా సీత లుక్‌లో ఎంతో బాగుంది.. ప్రేక్షకుల‌ను ఎంతో ఫిదా చేస్తుంద‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాదాపు రూ 400కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈచిత్రానికి ఎం.ఎం కీర‌వాణీ స్వ‌రాలు అందించారు. ఇక ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.‌‌