RRR: ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఓ పాట పాడ‌నున్న అలియాభ‌ట్..

RRR: ద‌ర్శ‌క దిగ్గ‌జ రాజ‌మౌళి ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి ఓ వార్తా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ బ్యూటీ అలియాభ‌ట్ పాట పాడ‌నుంద‌ట‌.. కాగా RRR ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజు పాత్ర‌లు చేస్తుండ‌గా.. ఇందులో చ‌ర‌ణ్ స‌ర‌స‌న అలియా భ‌ట్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే అలియాభ‌ట్ మంచి సింగ‌ర్ అన్న విష‌యం తెలిసిందే.

rrr aliya

అయితే ఇప్పుడు రాజమౌళి కోరిక మేర‌కు RRRఆర్ఆర్ఆర్ హిందీ వెర్ష‌న్‌కు పాట పాడుతున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది. అలాగే RRRఈ పాట కూడా ఆమెపై చిత్రీక‌రించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. అలియా ఇదివ‌రకు బాలీవుడ్‌లో హైవే, హంటీ శ‌ర్మా కీ దుల్హ‌నియా వంటి సినిమాల్లో పాట‌లు పాడి గాయ‌నిగా మంచి మార్కులే తెచ్చుకుంది. ఇక ఈ చిత్రాన్ని డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య నిర్మిస్తుండ‌గా.. ఎం.ఎం. కీర‌వాణీ RRRఈ చిత్రానికి స్వ‌రాలు అందిస్తున్నారు.‌ ‌