Bollywood: అలియా సెక్స్‌వ‌ర్క‌ర్‌గా న‌టించిన‌ గంగూభాయి క‌తియావాడి చిత్ర టీజ‌ర్‌..

Bollywood: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియాభ‌ట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న చిత్రం గంగూబాయి క‌తియావాడి. ఈ చిత్రానికి ప్ర‌ముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో.. హుస్సేన్ జైదీ ర‌చించిన మాఫీయా క్వీన్స్ ఆఫ్ ముంబైలోని మేడ‌మ్ ఆఫ్ కామ‌తిపుర ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా నేడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా ఈ రోజు ఈ Bollywoodచిత్రం టీజ‌ర్‌తో పాటు రిలీజ్ డేట్‌ను వ‌దిలారు. ఈ చిత్రంలో ఆలియాభ‌ట్ సెక్స్‌వ‌ర్క‌ర్‌గా న‌టిస్తోంది. ఈ చిత్ర క‌థ విష‌యానికొస్తే.. త‌న ప్రియుడితో క‌లిసి ముంబైకు వ‌చ్చిన యువ‌తి.. ప్రియుడు మోసం చేసి వేశ్యాగృహానికి అమ్మేస్తాడు.

gangubhai

ఆ త‌ర్వాత అక్క‌డ నుంచి బ‌య‌టికి రాలేక తీవ్ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొని చివ‌ర‌కు తానే స్వ‌యంగా వేశ్యాగృహాల‌ను న‌డిపే స్థాయికి చేరుకుంటుంది. అప్ప‌టి ముంబై డాన్‌ల‌తో ప‌రిచ‌యాలు క‌లిగి ఉండి ఆ ప్రాంతానికి రాణిగా ఎదిగింది. ఈ నేప‌థ్యంలోనే సెక్స్ వ‌ర్క‌ర్ల హ‌క్కుల కోసం పోరాడి.. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వంతో మాట్లాడిన ప‌రిష్కారం చూపింది. ఈ Bollywoodసినిమాలో అలాంటి బ‌ల‌మైన పాత్ర‌లో ఆలియాభ‌ట్ క‌నిపించ‌నుంది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజ‌య్‌దేవ్‌గ‌న్‌, ఇమ్రాన్ హ‌ష్మి, హ్యూమా ఖురేషి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని భ‌న్సాలీ ప్రొడ‌క్ష‌న్స్, పెన్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై సంజ‌య్‌లీలా భ‌న్సాలీ, జ‌యంతిలాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈBollywoodచిత్రం జులై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.