రామ్ చరణ్ హీరోయిన్ వేశ్య గృహాలు నడిపిస్తుందా?

రాజీ సినిమాలో తన అద్భుత నటనకి విమర్శకుల ప్రశంశలు అందుకున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ప్రస్తుతం జక్కన చెక్కుతున్న మాగ్నమ్ ఓపస్ ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ కి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే అలియా మరో షాకింగ్ సినిమాలో ఛాలెంజింగ్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ముంబయి డాన్‌గా పాపులర్‌ అయిన మాఫియా క్వీన్‌ గంగూబాయి జీవితం ఆధారంగా రూపొందించే ‘గంగూబాయి’ చిత్రంలో టైటిల్‌ రోల్‌ని అలియా పోషించనున్నట్టు తెలుస్తుంది. ముందుగా ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రాని ఎంపిక చేశారు కానీ ఆమె తప్పుకోవడంతో అలియా లైమ్ లైట్ లోకి వచ్చింది. ముంబయి రెడ్‌లైట్‌ ఏరియా కమతిపురలో వేశ్యగృహాలను నడిపిస్తూ లేడీ మాఫియా డాన్‌గా వెలిగిన గంగూబాయి జీవితం ప్రధానంగా ఎస్‌ హుసేన్‌ జైదియాల్త్‌ రాసిన ‘మాఫియా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబాయి’ అనే బుక్‌ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. సంజయ్ లీలా భన్సాలీ ఈ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కించనున్నారు. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న అలియా, వేశ్య గృహాలు నడిపించే మాఫియా డాన్ పాత్రలో చేయడానికి ఒప్పుకోవడం గొప్ప విషయమే. ఈ మూవీతో పాటు అలియా హిందీలో ‘బ్రహ్మస్త్ర’,’సడక్‌ 2’లో నటిస్తూ బిజీగా ఉంది.