రణబీర్ కపూర్ అలియా ప్రేమ-పెళ్లి గురించి కరీనా కామెంట్స్

రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్ తర్వాత బాలీవుడ్ లో అంత హ్యాపెనింగ్ పెయిర్ ఏదైనా ఉందా అంటే అది తప్పకుండ రన్బీర్ కపూర్ అలియా భట్ లదే. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ ఎప్పుడూ కలిసి కనిపించినా అదో ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. త్వరలో రన్బీర్, అలియా పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలా సార్లు వార్తలు బయటకి వచ్చాయి కానీ అవన్నీ ఉత్త పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా ఈ విషయమై అలియా భట్, కరీనా కపూర్ ఈ విషయంపై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

alia ranbir

వరసకి రణబీర్ కపూర్ కి అక్క అయిన కరీనా కపూర్, రీసెంట్ గా జరిగిన మామీ అవార్డుల వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రణబీర్ అలియా ప్రేమ వ్యవహారం గురించి స్పందించింది. ఎప్పుడూ ఏదో లింక్ పెట్టి అందరినీ ఇరికించే కరణ్ జోహార్, అలియాని కరీనాని కలిపి ఇంటర్వ్యూ చేశాడు. ఈ సమయంలో కరీనాకు మరదలు అవుతానని ఎప్పుడైనా భావించావా? అంటూ ఆలియాను కరణ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అలియా సమాధానం చెప్పే లోపే కరీనా స్పందిస్తూ.. రణ్‌బీర్, ఆలియా వివాహం చేసుకుంటే ఈ ప్రపంచంలో మొదట సంతోషించే వ్యక్తిని నేనే అంటూ జవాబిచ్చింది. ఆ తర్వాత ఆలియా మాట్లాడుతూ.. రణ్‌బీర్‌తో పెళ్లి గురించి ఇప్పటివరకూ తానేమి ఆలోచించలేదని, ఇప్పట్లో ఆలోచించాలనుకోవడం కూడా లేదు అంటూ అందరికీ షాక్ ఇచ్చే సమాధానమే ఇచ్చింది. ఈ ఇద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది వాళ్ల పర్సనల్ విషయం కానీ ప్రస్తుతానికైతే అలియా భట్, రణబీర్ కలిసి బ్రహ్మాస్త్ర అనే సినిమా చేస్తున్నారు.