అంత లేదు కానీ ఆయన కోసమే…

రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కలయికలో వస్తున్న భారీ బడ్జట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. బాహుబలి తర్వాత మరోసారి పాన్ ఇండియా సినిమా తెరకెక్కిస్తున్న రాజమౌళి, ట్రిపుల్ ఆర్ లో బాలీవుడ్ స్టార్ అలియా భట్ ని రామ్ చరణ్ కి హీరోయిన్ గా ఎంపిక చేశాడు. ఈ మూవీతో మొదటిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్న అలియా, రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆర్ ఆర్ ఆర్ గురించి మాట్లాడుతూ… “ట్రిపుల్ ఆర్ సినిమాలో తన పాత్ర నిడివి చాలా తక్కువని, స్క్రీన్ టైం ఎక్కువ లేకున్నా కూడా రాజమౌళి కోసమే ఈ సినిమా చేస్తున్నా ” అంటూ చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో బిజీగా ఉన్న అలియాకి సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి లాంటి దర్శకులతో వర్క్ చేయడం తన డ్రీమ్ అని ఈ కారణంగానే స్క్రీన్ టైం తక్కువ ఉన్నా కూడా ట్రిపుల్ ఆర్ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపింది.

అలియా పాత్ర నిడివి తక్కువే అయినా రామ్ చరణ్ తో మంచి సీన్స్ ఉంటాయట, పైగా జక్కన సినిమాలో చిన్న పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అలియా కనిపించేది కాసేపే అయినా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ సినీ అభిమానులందరికీ దగ్గరయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం బల్గెరియాలో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే అలియా, రామ్ చరణ్ తో పాటు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి హాజరుకానుంది. అలియా భట్ తో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఆర్ ఆర్ ఆర్ లో ఒక కీ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే.