Ali: గురువుల‌తో ఆలీ సినిమా.. ‌

Ali: టాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ఆలీ ఇన్ని రోజులు ప్రేక్ష‌కుల‌కు కామెడీతో ప‌ల‌క‌రించిన ఆయ‌న ప్ర‌స్తుతం అంద‌రు బాగుండాలి అందులో నేనుండాలి చిత్రంతో నిర్మాతగా మారుతున్న విష‌యం తెలిసిందే. ఆలీవుడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అలీ, న‌రేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో శ్రీ‌పురం కిర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం డిసెంబ‌ర్ 16న ఈ చిత్ర షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మానికి ఆలీని హీరోగా చేసిన అచ్చిరెడ్డి-కృష్ణారెడ్డి అతిథులుగా విచ్చేశారు. అయితే.. ఈ చిత్రంలో వీరిద్ద‌రు న‌టిస్తున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు తెర‌వెనుక‌నే ఉంటూ ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెలుగు ఇండ‌స్ట్రీకి అందించిన ఈ దిగ్గ‌జాలు తొలిసారిగా క‌లిసి వెండితెర మీద‌కు రాబోతున్నారు. గ‌తంలో ఎస్‌వీ కృష్ణారెడ్డి ప‌లు చిత్రాల్లో హీరోగా న‌టించిన‌ప్ప‌టికీ.. అచ్చిరెడ్డితో క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి. ఈ విష‌యాన్ని Ali ఆలీ మీడియాతో పంచుకున్నారు. నన్ను హీరోగా ప‌రిచ‌యం చేసి నా కెరీర్‌ని కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిగార్ల‌కు మ‌ళ్లీ నేను నిర్మాత‌గా మారి తెర‌కెక్కిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి సినిమాలో అవ‌కాశం ఇవ్వ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని అన్నారు. నా మీద అభిమానంతో వీరిద్ద‌రు న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని Ali ఆలీ పేర్కొన్నారు. ఇక మళ‌‌యాలంలో తెర‌కెక్కిన బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రం వికృతి కి ఈ సినిమా రీమేక్‌.