Tollywood: ప‌వ‌న్ సినిమాల్లో మ‌ళ్లీ ఆలీ‌ చేయ‌బోతున్నాడా.. క్లారిటీ ఇచ్చిన ఆలీ!

Tollywood: టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టార్ క‌మెడియ‌న్ ప్రాణ స్నేహితులు అనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప‌వ‌న్ కేవ‌లం కొద్ది మందికి మాత్ర‌మే అత్యంత స‌న్నిహితంగా ఉంటారు. అత్యంత స‌న్నిహితుల్లో అలీ ఒక‌రు. దాదాపు ప‌వ‌న్ న‌టించిన అన్ని మూవీల్లోనూ అలీ న‌టించారంటే వారి మ‌ధ్య ఎంతో గాఢ‌మైన స్నేహం ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీని స్థాపించాక అలీ కూడా ఆ పార్టీలో జాయిన్ అవుతార‌ని అనుకున్నారంతా. కానీ తీరా చూస్తే వైసీపీ కండువా క‌ప్పుకున్నాడు. దీంతో ప‌వ‌న్ అభిమానులు అంతా షాక్‌కు గుర‌య్యారు. అలీని ఓరేంజ్‌లో ఆడేసుకున్నారు ప‌వ‌న్ అభిమానులు.. ఫ్రెండ్‌షిప్ అంటే ఇదేనా.. ఫ్రెండ్‌షిప్ వాల్యూను కించ‌ప‌ర్చావు.. అస‌లు నీకు ఫ్రెండ్‌షిప్ వాల్యూ తెల‌వ‌దు అంటూ సోష‌ల్ మీడియాలో అలీని దుమ్ముదులిపారు ప‌వ‌న్ ఫ్యాన్స్‌. ఇలా కాలం గ‌డిచిపోయింది.

Comedian Ali About Pawan Kalyan Movie | Ali Special Chit Chat | TFPC Exclusive

ఇప్పుడు తాజాగా వీరిద్ద‌రు ఒకే వేదిక‌పై క‌లుసుకుని న‌వ్వుతూ మాట్లాడుకుంటూ ఫోటోల‌కు పోజులిచ్చారు. దీంతో వీటీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఈ ఫోటో, వీడియోల‌పై ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆనంద ప‌డ్డారు. ప్రాణ స్నేహితులు మ‌ళ్లీ క‌లిసిపోయార‌ని, వీరి కాంబో నుంచి సినిమా రావాల‌ని కోరుకుంటున్న అభిమానుల్లో ఈ విష‌యంపై పండుగ వాతావ‌ర‌ణం క‌నిపించింది. ‌కాగా తాజాగా అలీ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌వ‌న్ ప్ర‌స్తావ‌న‌ను యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిస్తూ.. మిమ్మ‌ల్ని చూస్తుంటే ఏ హీరోయినో, మీ సినిమాల విష‌యాల‌ను అడ‌గ‌డం కంటే ప‌వ‌న్‌క‌ళ్యాన్ గురించి అడ‌గాల‌ని అనిపిస్తుంది.. ప‌వ‌న్‌గారికి మీకు ఉన్న ఆ బాండింగ్ ఏంటీ అని యాంక‌ర్ అడ‌గ్గా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు చాలా మంచి వ్య‌క్తిత్వం క‌లిగిన వ్య‌క్తి.. సినిమాల్లో న‌టించేట‌ప్పుడు త‌న ప‌ని తాను చేసుకునే వ్య‌క్తి.. క‌థ ఏంటీ, ఎంత మంది ఆర్టిస్ట్‌లు, ఎలా న‌టించాలి..ఇలా షూటింగ్ ప్యాక‌ప్ అవ్వ‌గానే వెళ్లిపోతాడు. అలాగే సినిమా షూటింగ్‌లో ఎవ‌రైనా ఆర్టిస్ట్ లేన‌ప్పుడు ఆ ఆర్టిస్ట్ గురించి త‌ప్పుగా గాని మాట్లాడితే ఊరుకునే వ్య‌క్తి కాదు ప‌వ‌న్‌. అదేవిధంగా ప‌వ‌న్‌తో జ‌ర్నీ అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి, ఆజ్ఞాత‌వాసి వంటి రెండు చిత్రాల్లో కాకుండా మిగ‌తా అన్ని చిత్రాల్లో మేము క‌లిసి న‌టించాం. ఇప్పుడు ప‌వ‌న్ రీఎంట్రీ ఇస్తున్న వ‌కీల్‌సాబ్‌లో తాను న‌టించ‌లేదు కాని.. ఆ త‌ర్వాత ప‌వ‌న్ చేయ‌బోయే చిత్రాల్లో క‌చ్చితంగా నేనుంటా అని అలీ పేర్కొన్నాడు.