“ఏ ఎల్ సి సి (ఓ యూనివర్సల్ బ్యాచిలర్)” చిత్ర రివ్యూ

ఎల్ ఆర్ ఫిలిం సర్క్యూట్స్ బ్యానర్ పై లేలీధర్ రావు రచన దర్శక నిర్మాణంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ ఎల్ సి సి (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). జేపీ నవీన్, శ్రావణి శెట్టి జంటగా నటించగా శ్రీకర్ కోమండూరి, నేత్ర, ధనుష్ దేవర పోలి, శామ్ నాయక్, డి శ్రీనివాసులు రెడ్డి తదితరులు కీలకపాత్రను పోషించారు. జశ్వంత్ పసుపులేటి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించగా ఎస్ చరణ్ తేజ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. సోషల్ రామా జోనర్ లో వచ్చిన ఈ చిత్రం నేడు అనగా ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ:
ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు తనకు ఇష్టమైన సినిమాలను వదిలేసి తన కుటుంబం కోసం ఎంతో కష్టపడి చదువుకోవడం కోసం హైదరాబాద్ వస్తాడు. తన గోల్ సాధించే దిశలో ఉండగా తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి వచ్చిన తర్వాత తన జీవితంలో వచ్చే మార్పులు ఏంటి? ఆ అమ్మాయి రావడం వల్ల తను అనుకున్న గోల్ ని రీచ్ అవుతాడా లేదా? తన ప్రయాణంలో అతని స్నేహితులు ఎంతవరకు తనకు తోడుగా నిలబడతారు? అసలు ట్రైలర్లో చూపించినట్లు ఆ యువకుడు అమ్మాయి లపై అంత ద్వేషం పెంచుకోవడానికి కారణం ఈ పరిచయమైన అమ్మాయా లేదా వేరే ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండి ధరపై ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన:
చిత్రంలో కథానాయకుడిగా నటించిన నవీన్ (విగ్నేష్) తన సెటిల్ పర్ఫార్మెన్స్ తో చాలా సెటిల్డ్ యాక్టర్ గా పెర్ఫాన్ చేశాడు. కొత్త నటుడు అయినప్పటికీ ఎక్కడ కూడా అటువంటి డౌట్ రాకుండా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నటుడిగా పర్ఫామెన్స్ ఇచ్చారు. అలాగే చిత్రంలో స్క్రీన్ ప్లే తక్కువైనప్పటికీ హీరోయిన్ గా నటించిన శ్రావణి శెట్టి (మనూజ) చిత్రంలో తన క్యారెక్టర్ కు తగ్గట్లు చాలా మంచి పర్ఫార్మన్స్ ఇచ్చారు. అలాగే ఇతర నటీనటు అయిన నేత్ర (ప్రాచి), శ్యామ్ (ప్రవీణ్) తదితరులు చిత్రానికి ప్లస్ గా మారారు. అలాగే చిత్రంలో హీరో నవీన్ కు రూమ్మేట్ గా నటించిన ధనుష్ (బాషా) అటు కామెడీ ఇంకా ఇటు ఎమోషనల్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే చిత్రంలో ఇతర పాత్రలు పోషించిన ఆర్టిస్టులు అంతా తమ తమ పరిధిలో నటిస్తూ చిత్రానికి మరింత బోనస్గా నిలిచారు.

సాంకేతిక విశ్లేషణ:
ఈ చిత్ర రచయిత, దర్శకుడు అయినటువంటి లేలీధర్ రావు తాను అనుకున్న అతను కాస్త నిదానంగా అనుకున్న విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విజయం సాధించారు. చిత్రంలో డైలాగ్స్ అంతా గట్టిగా లేనప్పటికీ వాటి వెనకాల ఉన్న భావం మాత్రం ఎంతో అర్థవంతంగా ఉంది. అలాగే మంచి నిర్మాణ విలువలతో టేకింగ్ పరంగా సినిమా సినిమాటోగ్రాఫర్ ని ఎంతో బాగా వాడుకున్నట్లు అర్థమవుతుంది. లొకేషన్స్ తక్కువ అయినప్పటికీ న్యాచురల్ లొకేషన్స్ లో తీస్తూ సినిమా అంతా మన చుట్టుపక్కల జరిగే అటువంటి చాలా సాధారణ కథల అనిపిస్తూ చూసే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అలాగే కలరింగ్ బాగుంది. చిత్రంలో ప్రతి సీనులను చాలా ప్రెసెంట్ విజయంతో స్టోరీ స్మూత్ గా వెళ్ళినందుకు సంగీత దర్శకుడు ఎంతో కృషి చేసినట్లు అర్థమవుతుంది. పాటలలో ముఖ్యంగా బ్యాచిలర్ టైం అనే సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. అదేవిధంగా ఇతర సాంకేతిక విషయాలలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రం రూపుదిద్దుకోవడం జరిగింది.

ప్లస్ పాయింట్స్:
చక్కటి సందేశం, నటీనటుల నటన, కథ, బిజిఎం

మైనస్ పాయింట్స్:
నటీనటులు కొత్తవారు కావడం, డైలాగ్స్, చిత్రం కొంచెం స్లోగా ఉండటం

సారాంశం:
నేటి యువతను ఆధారంగా తీసుకొని సమాజంలో ఎక్కువగా కనిపించే కొన్ని సన్నివేశాలతో కుటుంబ సమేతంగా చూసే విధంగా ఒక మంచి సోషల్ మెసేజ్ తో ఈ చిత్రం ఉంది.