ఓవర్సీస్ లో రికార్డు బిజినెస్

త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో. సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ చేస్తూ శరవేగంగా షూటింగ్ జరుపకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ బయటకి రాబోతోంది. ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ సమాజవరగమన అంటూ సాగే సాంగ్ నుంచి చిన్న టీజర్ రిలీజ్ చేశారు. మ్యూజిక్ లవర్స్ ని అలరిస్తున్న ఈ సాంగ్ టీజర్ లో త్రివిక్రమ్ మార్క్ ట్రెడిషనల్ టచ్ స్పష్టంగా కనిపించింది. గత కొంత కాలంగా బెస్ట్ ఆల్బమ్స్ ఇస్తున్న థమన్, మరోసారి గ్రేట్ పీస్ ఆఫ్ వర్క్ ఇచ్చాడు. సిడ్ శ్రీరామ్ తన గొంతుతో మరోసారి తెలుగు పాటకి ప్రాణం పోశాడు. ఇప్పటికే బన్నీకి రెండు బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్, హ్యాట్రిక్ ఇవ్వడానికి సాలిడ్ గా రెడీ అవుతున్నాడు. మరి ఆ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాలి.

ఇదిలా ఉంటే అల వైకుంఠపురములో ఓవర్సీస్ బిజినెస్ 8.5కోట్లు చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఓవర్సీస్ లో త్రివిక్రమ్ కి మంచి మార్కెట్ ఉంది, మాములు హీరోతో కూడా కోట్లు కొల్లగొట్టడం త్రివిక్రమ్ కి తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అందుకే మాటల మాంత్రికుడి నుంచి సినిమా వస్తుంది అంటే ఫారిన్ ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అలాంటిది త్రివిక్రమ్ కి ఈసారి బన్నీ కూడా కలిశాడు కాబట్టి అల వైకుంఠపురములో ఓవర్సీస్ లో మంచి వసూళ్లనే రాబట్టే అవకాశం ఉంది.