Bollywood: బాలీవుడ్‌లోకి అల‌..వైకుంఠ‌పురం.. పూజాహెగ్దే పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ!

Bollywood: ప్ర‌ముఖ టాలీవుడ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం అల వైకుంఠ‌పురం. ఈ చిత్రంలో అల్లుఅర్జున్‌ను స‌రికొత్త‌గా స్టైలిష్‌గా చూపించారు త్రివిక్ర‌మ్‌. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ఘ‌న విజ‌యం సాధించి.. మంచి క‌లెక్ష‌న్స్ సొంతం చేసుకుంది ఈ చిత్రం. అలాగే ఇందులో సాంగ్స్ అన్నీ భారీ హిట్ అయ్యాయి.. యూట్యూబ్‌లో అయితే రికార్డు సృష్టించాయి సాంగ్స్‌.

Ala vikntapuram

కాగా ఈ చిత్రం తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుంది.. Bollywood బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌ణ్ సోద‌రుడు రోహిత్ ధావ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర‌లో బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ న‌టిస్తుండ‌గా.. పూజా హెగ్దే పాత్ర‌ల్లోBollywood బ్యూటీ కృతిస‌న‌న్ చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే వెలువ‌డుతుంద‌ని స‌మాచారం.