బన్నీని పిల్లలే ఆడుకున్నారు… ఫోటో పెట్టుకోని కుమ్మేసారు

అల్లు అర్జున్ పై కంప్లైంట్ వస్తున్నాయి. అదేంటి స్టైలిష్ స్టార్ బన్నీపైనే కంప్లైంట్ ఇస్తున్నారా? ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు అల్లు అర్హ, అల్లు అయాన్. అల్లు వారి నాలుగో తరం వారసులైన ఈ స్టార్ కిడ్స్, నాన్న అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలోని మూడో సాంగ్ ని చిల్డ్రన్స్ డే స్పెషల్ గా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో బన్నీ ఫోటో పెట్టి ఆర్హ, అయాన్ చేసిన అల్లరి అంతాఇంతా కాదు. అల్లు అర్జున్ ఫోటోని కొడుతూ, ఓ మై గాడ్ డాడీ అంటూ ఈ ఇద్దరూ సందడి చేశారు. థమన్ ఇచ్చిన టీజింగ్ ట్యూన్ కి టాప్ సింగర్స్ అందరూ కలిసి ఎనర్జిటిక్ గా మార్చారు. ఓ మై గాడ్ సాంగ్ ప్రోమో అయితే మెప్పించింది మరి ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే నవంబర్ 22 వరకూ ఆగాలి.