అల వైకుంఠపురములో నుంచి దసరా కానుక వచ్చింది

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో మూడోసారి రాబోతున్న సినిమా అల వైకుంఠపురములో. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ సామజవరగమన రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో 20మిలియన్ వ్యూస్ రాబట్టి కొత్త రికార్డు సృష్టించింది. సామజవరగమన మాయ ఇంకా తగ్గక ముందే మెగా అభిమానులకి స్వీట్ షాక్ ఇస్తూ అల వైకుంఠపురములో సినిమాలో నుంచి కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. నిన్నటి వరకూ ఈ పోస్టర్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు, సడన్ గా అల వైకుంఠపురములో పోస్టర్ బయటకి రావడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. దసరా కానుకగా బయటకి వచ్చిన ఈ పోస్టర్ లో బన్నీ ఫార్మల్స్ లో స్టైలిష్ గా ఉంటూనే, రౌడీలని ఇరగదీస్తున్నాడు.

ఇదిలా ఉంటే తాజాగా బయటకి వచ్చిన పోస్టర్ లో బన్నీ-త్రివిక్రమ్ సినిమాల జ్ఞాపకాలు కనిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ సినిమా జులాయి, ఇందులో హీరో ఇంట్రడక్షన్ మేడ మీద బట్టలు తీసే సమయంలో ఉంటుంది. అలాగే ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వచ్చిన రెండో సినిమా సన్నాఫ్ కృష్ణమూర్తిలో కూడా ఒక రెడ్ క్లాత్ ని కర్రకి కడుతూ బన్నీ మంచి డాలీగ్ చెప్తాడు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి ఆ గుడ్డముక్కకి చాలా సంబంధం ఉంది. ఇప్పుడు అల వైకుంఠపురములో పోస్టర్ లో కూడా బన్నీ చేతికి త్రివిక్రమ్ రెడ్ క్లాత్ ఇచ్చాడు. ఫైట్ సీక్వెన్స్ నుంచి రిలీజ్ చేసిన ఈ పోస్టర్ బన్నీ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేసింది. అయితే త్రివిక్రమ్ ఇచ్చింది జస్ట్ రెడ్ క్లాత్ కాదు అది హీరోయిన్ చున్నీలాగా కనిపిస్తుంది. పోస్టర్ ని క్లియర్ గా అబ్సర్వ్ చేస్తే బన్నీ బ్యాక్ గ్రౌండ్ లో కొందరు స్పోర్ట్స్ ప్లేయర్స్, వాలీబాల్ నెట్ ఉన్నాయి. ఒక గ్రౌండ్ లో అల్లు అర్జున్ ఎవరినో ఇరగదీస్తున్నాడు, మరి వాళ్లకి-హీరోయిన్ చున్నీకి ఉన్న సంబంధం ఏంటో తెలియాలి అంటే సంక్రాంతి వరకూ ఆగాలి.

Read: అల… అక్టోబర్ లో వస్తున్నారు