ఆ అమ్మాయి న‌న్ను రిజెక్ట్ చేసింది.. అక్ష‌య్‌-ట్వింకిల్ బంధానికి 20ఏళ్లు

బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్ వైవిధ్య‌త‌కు చిరునామాగా నిలుస్తుంటారు. విభిన్న‌మైన క‌థాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేస్తూ.. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తాయి ఆయ‌న సినిమాలు. దీంతో విజ‌య‌వంతంగా ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్నారు అక్షయ్‌. తాజాగా అక్ష‌య్‌.. క‌పిల్‌శ‌ర్మ షోకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా క‌పిల్‌శ‌ర్మ అక్ష‌య్‌కు ఓ ప్ర‌శ్న వేశారు.. మీరు ఫ‌స్ట్ ల‌వ్‌, ప్రియురాలి రిజెక్ట్‌ చేయ‌డం జ‌రిగిందా? దీనికి అక్ష‌య్ స‌మాధాన‌మిస్తూ..

akshay-twinkle

ఒక అమ్మాయిని ఇష్ట‌ప‌డ్డాను.. త‌న‌తో క‌లిసి మూడు నాలుగు సార్లు డేట్‌కు వెళ్లాను.. కానీ నాలో ఉన్న‌స‌మ‌స్య ఏంటంటే నాకు చాలా సిగ్గు. త‌న‌తో క‌లిసి బ‌య‌టికి వెళ్లిన‌ప్పుడు ఆమె భుజం మీద చేతులు వేయ‌డం, త‌న చేతిని ప‌ట్టుకోవ‌డం.. కిస్ చేయ‌డం లాంటివి చేయ‌లేదు. దీంతో ఆమె నన్ను రిజెక్ట్ చేసిందన్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు.. మీరు త‌న‌ని ప్ర‌పోజ్ చేయాల‌ని భావించిందేమో.. కానీ ఆమెకు ముద్దు పెట్ట‌లేదు కాబ‌ట్టే వ‌దిలేసింద‌ని, అయినా మీకు అంద‌మైన భార్య‌గా ట్వింకిల్ ఖ‌న్నా దొర‌క‌డం రాసి పెట్టి ఉంది.. అందుకు కూడా ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేసింది అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలాఉంటే.. అక్ష‌య్‌కుమార్‌- ట్వింకిల్ ఖ‌న్నా ఈ ఏడాదితో వివాహ బంధానికి 20ఏళ్లు పూర్త‌య్యాయి. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు దంప‌తులు క‌లిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. నేను నీతో భాగ‌స్వామ్యంలో ఉన్నాను. మ‌నం ఇర‌వై సంవ‌త్సరాల స‌మైక్య‌త‌కు చిహ్నంగా నిలిచాము. నువ్వు ఇప్ప‌టికీ నా హృద‌యాన్ని క‌దిలిస్తావు.. న‌న్ను న‌డిపిస్తావు.. వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు టీనా అంటూ పోస్ట్ చేశారు అక్ష‌య్‌. ఇక అక్ష‌య్ న‌టిస్తోన్న బ‌చ్చ‌న్‌పాండే సినిమా ప్ర‌స్తుతం సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో అక్ష‌య్ స‌ర‌స‌న కృతిస‌న‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఫ‌ర్హ‌ద్ సామ్‌జీ ద‌ర్శ‌క‌త్వంలో సాజిద్ న‌దియావాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.