కర్ణిసేనదెబ్బకి అక్షయ్ కుమార్ కి కొత్త తలనొప్పి…

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కి కొత్త తలనొప్పి పట్టుకుంది. హిందీ పరిశ్రమలోనే భారీ బడ్జట్ తో తెరకెక్కుతున్న అక్షయ్ లేటెస్ట్ మూవీ పృథ్విరాజ్. మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పీరియాడికల్ వార్ డ్రామాని యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సంజయ్ దత్ ప్రధాన పాత్రలో ఈ పృథ్విరాజ్ సినిమా 2019లో సెట్స్ పైకి వెళ్లింది. షూటింగ్ జరుగుతుండగానే పృథ్విరాజ్ మూవీకి భారీ క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ అండ్ పోస్ట్ వర్క్స్ ఒకేసారి జరుపుకుంటున్న ఈ మూవీని చిత్ర యూనిట్ 2021 నవంబర్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఈ మూవీకి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.

గతంలో ఎన్నో సినిమాలకి అడ్డంకులు సృష్టిస్తూ సినిమాలకి లేని తలనొప్పులు తెచ్చే కర్ణిసేన, పృథ్విరాజ్ చిత్రబృందానికి వార్నింగ్ ఇచ్చింది. ఈ సినిమా విషయంలో తమకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని తెలిపింది. వాటిని కాదని ముందుకెళ్తే.. పద్మావత్ సినిమా టైమ్ లో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరించింది. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి వివాదాలు చుట్టుముట్టాయి. టైటిల్‌ తో పాటు మరికొన్ని అంశాలపై కర్ణిసేన అభ్యంతరం చెబుతోంది. పృథ్విరాజ్‌ అనే టైటిల్‌ కరెక్ట్ కాదంటోంది. మహారాజు పూర్తి పేరు పృథ్విరాజ్ అనే టైటిల్ కి చౌహాన్ కూడా కలిపి పృథ్విరాజ్ అనే టైటిల్‌ ను పెట్టాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు రిలీజ్ కు ముందే సినిమాను తమకు చూపించాలని.. లేకపోతే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. మరి అక్షయ్ అండ్ టీం ఈ కర్ణిసేనని ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి.