వివాదం; ‘ల‌క్ష్మీ బాంబ్’ టైటిల్ మార్పు

త‌మిళంలో సూప‌ర్ హిట్ అయిన‌ కాంచ‌న సినిమాకు రీమేక్‌గా హిందీలో ల‌క్ష్మీ బాంబ్ అనే సినిమాను స్టార్ హీరో అక్ష‌య్ కుమార్‌తో డైరెక్ట‌ర్ రాఘ‌వ లారెన్స్ తెర‌కెక్కించిన విష‌యం తెలిసిందే. హీరోయిన్ కియారా అద్వానీ ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. క‌రోనా ప్ర‌భావం క్ర‌మంలో ఈ సినిమాని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్ని+హాట్‌స్టార్ ద్వారా నవంబ‌ర్ 9న విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు ఇప్ప‌టికే నిర్ణయం తీసుకున్నారు, అయితే ఈ సినిమా టైటిల్‌పై వివాదం చెల‌రేగ‌డంతో తాజాగా సినిమా టైటిల్‌ను మారుస్తూ ఆ సినిమా యూనిట్ నిర్ణ‌యం తీసుకుంది.

ల‌క్ష్మీ బాంబ్ అనే టైటిల్ త‌మ మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచేలా ఉంద‌ని కర్ణీ సేన సినిమా యూనిట్‌కు లీగల్‌ నోటీసులు జారీచేసింది. సినిమా పేరును వెంట‌నే మార్చాలంటూ డిమాండ్‌ చేసింది. నిర‌స‌న‌లు కూడా చేప‌ట్టింది. పేరు మార్చ‌క‌పోతే సినిమా విడుద‌ల‌ను అడ్డుకుంటామని హెచ్చ‌రించింది. దీంతో ‌క్ష్మీ బాంబ్ టైటిల్‌ని ల‌క్ష్మీగా మార్చుతున్న‌ట్లు సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది.

అంతేకాకుండా తాజాగా కొత్త టైటిల్‌తో పోస్ట‌ర్ కూడా సినిమా యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో అక్ష‌య్ కుమార్.. కియారా వెనుక నిలుచొని చూస్తున్నారు. కాగా ఈ పోస్ట‌ర్ ఫ్యాన్స్‌ని విప‌రీతంగా ఆక్టట్టుకుంటోంది.