ఒక్క సినిమాకు రూ.135 కోట్ల రెమ్యూనరేషన్

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ క్రేజ్ ఇప్పుడు మాములుగా లేదు. వరుస హిట్ సినిమాలతో సూపర్ ఫామ్‌లో ఉన్న అక్షయ్.. బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునే హీరోలలో టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. అందుకే ఇటీవల విడుదలైన ప్రపంచవ్యాప్తంగా ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రెటీల జాబితాలో ఇండియా నుంచి ఒక్క అక్షయ్ కుమార్ మాత్రమే చోటు సంపాదించుకున్నాడు. అక్షయ్ నటిస్తున్న సినిమాలకు భారీ క్రేజ్ ఉండటం, భారీ కలెక్షన్లను సంపాదించుకోవడంతో ఆయనకు ఎక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.

akshay kumar

ఈ క్రమంలో అక్షయ్ రెమ్యూనరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. మాములుగా ఒక సినిమాకు ఇప్పుడు అక్షయ్ కుమార్ రూ.120 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అయితే 2022లో చేయబోయే సినిమాలకు అక్షయ్ కుమార్ ఏకంగా రూ.135 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడట. దీంతో అక్షయ్ సినిమాల బడ్జెట్ ఇక రూ.200 కోట్లు దాటనుంది. అక్షయ్ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ ఉంటాడు.

ఆయన సినిమాలకు భారీ కలెక్షన్లు గ్యారంటీ అనే భావన నిర్మాతల్లో ఉంది. అక్షయ్ సినిమాల శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం రూ.80-90 కోట్ల వసూలు చేస్తున్నారు. ప్రొడక్షన్ బడ్జెట్ రూ.35 నుంచి రూ.45 కోట్ల వరకు ఉంటుంది. ప్రింట్, పబ్లిసిటీ కోసం రూ.15 కోట్లు ఖర్చు అవుతుంది. ఇలా రెమ్యూనరేషన్ కాకుండా అక్షయ్ సినిమాకు బడ్జెట్ రూ.180 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుంది.