Tollywood: నందిత శ్వేతా ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘‘అక్షర’’. సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై బి. చిన్ని కృష్ణ దర్శకత్వంలో సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘అక్షర’’ సినిమా టీజర్ ను మాటల మాంత్రికుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేశారు.. ‘‘అక్షర’’. మూవీ ఫిబ్రవరి 26న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా Tollywood ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘‘ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది.
చిన్ని కృష్ణ స్త్రీ పాత్రలను బలంగా రాయగలడు.. విద్యా వ్యవస్థ పై ఆయన నలుగురితో పంచు కోవలనుకుంటున్న ఆలోచనలు..అందరినీ ఆలోచింప జేస్తాయని నమ్ముతున్నాను.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అన్నారు. అక్షర ట్రైలర్ చూస్తే..అఖిల విశ్వాన్ని శాసించే ఆది శక్తి అక్షరమే అనే డైలాగ్ తో Tollywoodట్రైలర్ ప్రారంభమైంది. మన దేశంలో సగటున ప్రతి గంటకు ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడని స్లైడ్ లో చూపించారు. విద్యా వ్యవస్థ ఎలా వ్యాపారమయం అయ్యిందో చూపించే కథతో సినిమా చేసినట్లు తెలుస్తోంది. ఫీజుల కోసం, ర్యాంకుల కోసం కొన్ని ప్రైవేట్ కళాశాలలు చేస్తున్న అక్రమాలను Tollywood‘‘అక్షర’’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఫిజిక్స్ చెప్పే టీచర్ అక్షర పాత్రలో నందిత శ్వేతా కనిపిస్తోంది. ఆమె క్యారెక్టర్ లో ఇంటెన్స్ ఫర్మార్మెన్స్ ఆకట్టుకుంటోంది. విద్యార్థిని తండ్రిగా, ఈ విద్యా వ్యాపారానికి వ్యతిరేకంగా మాట్లాడే పాత్రలో హర్ష నటించారు. కాలేజ్ మాఫియాను నడిపించే పాత్రను సంజయ్ స్వరూప్ పోషించినట్లు తెలుస్తోంది. పోలీస్ ఆఫీసర్ గా శత్రు పవర్ ఫుల్ క్యారెక్టర్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో చచ్చిన వాళ్లకు నీకు ఏంటి సంబంధం అని శత్రు అడిగితే, జనం లోకి వెళ్లాలి అనే సమాధానం అక్షర ఇచ్చింది. అంటే విద్యా వ్యాపారంలోని అక్రమాలను సమాజానికి చెబుతూ, ఈ నిజాలు జనాల్లోకి వెళ్లాలి అనే అక్షర చెబుతున్నట్లు ఉంది. ఇలా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. Tollywoodఈ చిత్రంలో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజయ్ ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కెమెరామాన్ : నగేష్ బెనల్, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటర్ : జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కాస్టూమ్ డిజైనర్ : గౌరీ నాయుడు, లైన్ ప్రొడ్యూసర్స్ : గంగాధర్, రాజు ఓలేటి, పి.ఆర్.ఓ : జియస్ కె మీడియా, కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి,సుమంత్, నిర్మాణ సంస్థ : సినిమా హాల్ ఎంటర్ టైన్మెంట్, నిర్మాతలు : సురేష్ వర్మ అల్లూరి, అహితేజ బెల్లంకొండ, రచన – దర్శకత్వం : బి. చిన్నికృష్ణ.