Akshay: వ‌రుస సినిమాల‌తో ఫుల్ బిజీ.. ఆ సినిమా రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించిన అక్షయ్‌!

Akshay: బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. అక్ష‌య్ ప్ర‌స్తుత తాజా చిత్రం బ‌చ్చ‌న్‌పాండేలో న‌టించారు. ఈ చిత్ర షూటింగ్ ఇటీవ‌లే ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో అక్ష‌య్ మ‌రోసారి గ్యాంగ్‌స్టర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. నిర్మాత సాజిద్ న‌దియావాలాతో అక్ష‌య్‌కు ఇది 10వ చిత్రం.. కాగా ఫ‌ర్హ‌ద్ స‌మ్జీ ద‌ర్శ‌క‌త్వం ఈ సినిమా తెర‌కెక్కుతుండ‌గా.. ఇందులో Akshay అక్ష‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ అందాలు కృతిస‌న‌న్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ హీరోయిన్ల్‌‌గా న‌టిస్తున్నారు.

akshaykumar

అయితే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు అక్ష‌య్‌.. 2022 సంవ‌త్స‌రంలో జ‌న‌వ‌రి 26న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా అక్ష‌య్ పోస్ట్ చేశారు. ఇదిలా ఉంచితే.. వ‌రుస సినిమాలో అక్ష‌య్ ఫుల్ జోష్ మీదున్నారు. గ‌తేడాది సూర్య‌వంశీ చిత్రంలో Akshay:అక్ష‌య్ హీరోగా తెర‌కెక్కుతుండ‌గా.. ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది.. అయితే ఈ సినిమా స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో చిత్ర‌బృందం ఉన్న‌ట్లు స‌మాచారం. మ‌రోవైపు Akshay అక్ష‌య్‌కుమార్ బెల్‌బాట‌మ్ సినిమాను ఇటీవ‌లే షూటింగ్‌ను కంప్లీట్ చేసాడు.. ఈ చిత్రం క‌రోనా ముందు షూటింగ్ స్టార్ట్ చేసి అనంత‌రం పూర్తి చేసుకున్న బాలీవుడ్ అతిపెద్ద హీరో ప్రాజెక్ట్ చిత్ర‌మే Akshay బెల్‌బాట‌మ్. మ‌రోవైపు అక్ష‌య్‌కుమార్‌.. కోలీవుడ్ స్టార్ ధ‌నుశ్‌తో క‌లిసి అంత‌రంగీ రే సినిమాలో న‌టిస్తున్నారు. అలాగే భార‌తీయ చారిత్ర‌క యోధుడు పృథ్వీరాజ్ చౌహాన్ బ‌యోపిక్‌పై పృథ్వీరాజ్ చిత్రంలో అక్ష‌య్ న‌టిస్తున్నాడు. దీంతో పాటు రామ్ సేతు అనే సినిమా చేస్తున్నాడు Akshay అక్ష‌య్‌.