


ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజు, దీపిక పిల్లి జంటగా నటిస్తూ సందీప్ బొల్లా, సాయి నితిన్ రచనా దర్శకత్వంలో M&M బ్యానర్ పై ఈనెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఎంఎన్ బాల్రెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన ఈ చిత్రానికి రధన్ సంగీతాన్ని కంపోజ్ చేయగా పవన్ కళ్యాణ్ ఎడిటర్ గా పనిచేశారు. వెన్నెల కిషోర్, సత్య, జటప్ శ్రీను, కోదాటి పవన్ కళ్యాణ్, ఝాన్సీ, మురళీధర్ గౌడ్, జాన్ విజయ్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఇక ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…
కథ:
సిటీలో పుట్టి పెరిగిన ఒక సివిల్ ఇంజనీర్ (ప్రదీప్ మాచిరాజు) ప్రపంచంతో పని లేకుండా బ్రతుకుతున్న ఓ గ్రామానికి ఒక ప్రాజెక్టు పనిమీద వెళ్తాడు. అయితే ఆ గ్రామంలో ఉన్న కట్టుబాటుకు ఆ గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఆడపిల్లను (దీపికా పిల్లి) 60 మంది యువకులు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. దాని కారణంగా అదే గ్రామానికి వెళ్ళిన ఈ సివిల్ ఇంజనీర్ ఎలా పరిచయమవుతుంది? వారి ప్రయాణం ఎలా సాగుతుంది? ఆ విషయం ఆ గుడివాడకి తెలిస్తే ఏం జరుగుతుంది? వారికి పెళ్లి జరుగుతుందా లేదా? అలాగే 60 మందికి పెళ్లి జరుగుతుందా లేదా? అసలు వాడితో ఇంజనీర్ కి వచ్చిన సమస్య ఏంటి? గ్రామంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే పిన్ని తలపై చిత్రాన్ని చూడాల్సిందే.
నటీనటుల నటన:
ఈ చిత్రంలో కథానాయకుడు పాత్ర పోషించిన ప్రదీప్ మాచిరాజు తన టైమింగ్ ఇంకా ఎంటర్టైన్మెంట్ తో ఎలా అయితే బుల్లితెరపై ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తారో అదేవిధంగా ఈ చిత్రంలో కూడా పూర్తి వినోదాన్ని అందిస్తూ ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా దీపికాపెల్లి కథానాయకగా మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు. ఒక పల్లెటూరి అమ్మాయిల తన పాత్రలో పడకాయి ప్రవేశం చేసి నటించాలి. అదేవిధంగా చిత్రంలో ముందు నుండి చివరి వరకు సత్య తన కామెడీతో పూర్తిగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ మంచి వినోదం అందించారు. అదేవిధంగా వెన్నెల కిషోర్, గెటప్ శీను, పవన్ కళ్యాణ్ స్క్రీన్ పై కనిపించిన అంతసేపు తమ కామెడీతో మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. రోహిణి, ఝాన్సీ, మురళీధర్ గౌడ్ అటు తమ పాత్రలకు తగ్గట్లు నటిస్తూ మంచి ఎమోషన్ క్యారీ చేశారు. అలాగే చిత్రంలో వివిధ పాత్రలు పోషించిన ఇతర నటీనటులు అంతా తమ పరిధిలో తమ నటిస్తూ మంచి వినోదాన్ని అందించారు.


సాంకేతిక విశ్లేషణ:
రాసుకున్న కథను వెండి తెరపై చూపించడంలో సందీప్, సాయి నితిన్ మంచి సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఇద్దరు దర్శకులు కలిసి పనిచేస్తూ వచ్చిన చిత్రాలు మంచి హీట్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ చిత్రం కూడా విజయ ఖాతాలో చేరింది. సినిమాలో ముఖ్యంగా డైలాగ్స్ ఇంకా కామెడీ టైమింగ్ బాగా వచ్చాయి. అక్కడక్కడ కొంచెం లాక్ ఉంది అనుకున్నా ప్రతిసారి అటు సత్య లేదా ఇటు గెటప్ శీను వారి కామెడీ టైమింగ్స్ తో దానిని కప్పిపుచ్చుతూ సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చేశారు. పాటలు బాగానే ఉన్నాయి. సినిమా రియల్ లొకేషన్స్లో తీసినట్లు అర్థమవుతుంది. కలరింగ్ ఇంకా ఇతర సాంకేతిక విశ్లేషణలో పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. అటు నటీనటుల పరంగా అలాగే ఇటు సాంకేతిక విషయాలలో ప్రతి ఒక్కరిని దర్శకులు బాగా వాడుకున్నట్లు అర్థమవుతుంది.
ప్లస్ పాయింట్స్:
నటీనటుల నటన, కథ, కామెడీ, ఎమోషన్.
మైనస్ పాయింట్స్:
పాటలు, కొంచెం లాగ్.


సారాంశం:
వేసవికాలంలో కుటుంబ సమేతంగా వెళ్లి ఫుల్ ఎంటర్టైన్ అవ్వడానికి ప్రేక్షకులు ముందుకు వచ్చిన చిత్రంగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నిలిచిపోతుంది. ప్రదీప్ మాచిరాజు సినీ కెరియర్లో మంచి చిత్రంగా ఉంటుంది.