“అఖిల్ విజన్ మూవీస్” ప్రొడక్షన్-1 ప్రారంభం!

తెలుగు తెరకు మరో కొత్త నిర్మాత పరిచయమవుతున్నారు. ఆయన పేరు ఇంద్రకంటి మురళీధర్. “అఖిల్ విజన్ మూవీస్” పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించి పూజా కార్యక్రమాలతో తన తొలి చిత్రానికి శ్రీకారం చుట్టారు. యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి ఈ విభిన్న తరహా చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్, ఫిల్మ్ నగర్ లోని సాయిబాబా ఆలయంలో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం ముహూర్తం షాట్ ను హీరో అనిల్ పై చిత్రీకరించారు. పారిశ్రామికవేత్త మహేష్ పటేల్ క్లాప్ కొట్టగా… ఎడిట్ పాయింట్ అధినేత ఇప్పలపల్లి రమేష్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈనెల 26 నుంచి రెగ్యులర్ షూట్ జరుపుకోనున్న ఈ చిత్రం ప్రివ్యూ డేట్ నవంబర్ 19గా నిర్మాత ఇంద్రకంటి మురళీధర్ ప్రకటించడం విశేషం!