’25’ఏళ్ళ తరువాత మళ్ళీ సెట్టయిన ‘అఖిల్’, ‘ఆమని’ కాంబినేషన్!!

అక్కినేని యువ నటుడు అఖిల్ అక్కినేని నటించిన మొట్ట మొదటి సినిమా సిసింద్రీ. 1995లో వచ్చిన ఆ సినిమా ఇంగ్లీష్ మూవీ బేబీస్ డే అవుట్ కథ ఆధారంగా ఆర్జీవి శిష్యుడు శివ నాగేశ్వరరావు తెరకెక్కించిన ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. అప్పుడు అఖిల్ వయసు కేవలం ఒక ఏడాది మాత్రమే. అయితే ఆ సినిమాలో తల్లి పాత్రలో అమని నటించిన విషయం తెలిసిందే.

ఇక 25 ఏళ్ల తరువాత మళ్ళీ అమని అఖిల్ కి తల్లి పాత్రలో కనిపించబోతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అమని అఖిల్ కి తల్లిగా కనిపించనుంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అమని ఆ విషయాన్ని తెలియజేసింది. “అఖిల్ చిన్నప్పుడే నన్ను అమ్మా అనేవాడు. ఇప్పటికి కూడా అదే మాట. ఏ మాత్రం తేడా లేకుండా ఆప్యాయంగా పలకరిస్తాడు. 30రోజుల్లో అనుకున్న షూటింగ్ 60రోజులు చేయాల్సి వచ్చింది. అఖిల్ తో ఆడుతూ పాడుతూ షూటింగ్ సాగిపోయింది. లాస్ట్ డే అప్పుడే షూటింగ్ ఆయిపోయిందా అని ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు. ఆ మూమెంట్స్ ఎప్పటికి మరచిపోలేను అని అమని తెలియజేసింది”.