సాగరతీరంలో ఏజెంట్ సాహసాలు…

అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో అఖిల్ సీక్రెట్ అజెంట్ గా క‌న‌ప‌డబోతున్నాడు. రేసీ స్క్రీన్ ప్లే, స్టైలిష్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఏజెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది.

కరోనా సెకెండ్ వేవ్ తగ్గు ముఖం పట్టడంతో ఆగిపోయిన సినిమాలు తిరిగి షూటింగ్ లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. “ఏజెంట్” మూవీ షూటింగ్ త్వరలో పునః ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి ప్లాన్ చేశారు. ఇప్పటికే అక్కడ కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. అనంతరం హైదరాబాద్ లో నెక్స్ట్ కీలక షెడ్యూల్ చేయనున్నారు. మన ఆడియన్స్ మర్చిపోయిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ కి అడవి శేష్ గూడచారి సూపర్ హిట్ అయ్యి మళ్లీ మార్కెట్ ఓపెన్ చేసింది. గోపీచంద్ చాణక్య పేరుతో ఈ జనార్ లోనే సినిమా చేయగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఇటివలే డెవిల్ అనే మూవీ అనౌన్స్ చేశాడు.