అఖిల్ అక్కినేని ఇన్ బీస్ట్ మోడ్

అక్కినేని అఖిల్, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కాంబినేష‌న్ లో రాబోతున్న సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ మూవీలో అఖిల్ సీక్రెట్ అజెంట్ గా క‌న‌ప‌డబోతున్నాడు. రేసీ స్క్రీన్ ప్లే, స్టైలిష్ యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఏజెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలుస్తాయట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో అఖిల్ పై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించడానికి దర్శకుడు సురేందర్ రెడ్డి షూట్ చేస్తున్నాడు.

is akhil-agent movie going to be a pan indian movie ...?

అఖిల్ కెరీర్ లో 5వ సినిమాగా రూపొందుతున్న ఏజెంట్ ని అనిల్ సుంకరతో కలిసి సురేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే అక్కినేని అభిమానుల్లో ఈ సినిమా మీద భారీగా అంచనాలు పెంచేసింది. ఈ అంచనాలను మరింతగా పెంచుతూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ బ్యాక్ లుక్ ని రిలీజ్ చేశాడు. ఈ ఫోటోలో అఖిల్ బీస్ట్ మోడ్ లో ఉన్నాడు. అఖిల్ ఫిట్ గా ఉన్నాడు అనడం కన్నా రాక్ సాలిడ్ గా ఉన్నాడు అనొచ్చు. అఖిల్ లో ఇంత చేంజ్ అసలు ఊహించి ఉండరు. వి షేప్ లో బాడి బిల్డ్ చేసిన అఖిల్, ఏజెంట్ అంచనాల రేంజుని పెంచాడు. ఈ పిక్ పోస్ట్ చేసిన సురేందర్ రెడ్డి దీనికి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా పెట్టడం ఆసక్తిని రేకిత్తిస్తోంది. సురేందర్ రెడ్డి ‘ఏజెంట్ లోడింగ్’ అంటూ కొత్త లుక్ ని రివీల్ చేసి సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు ఇది ప్రారంభం మాత్రమే … మీకు మునుముందు ఉంది పండగ’.. అని సురేందర్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.